...

Telangana: వేములవాడలో ప్రత్యక్షమైన బిత్తిరి సత్తి డూప్..అచ్చం బిత్తిరిసత్తి వేషధారణలో సాయి కుమార్?

Telangana: బిత్తిరి సత్తి ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు.విభిన్నమైన వేషధారణ మాటతీరుతో ఎంతోమందిని ఆకట్టుకున్న బిత్తిరి సత్తి అందరికీ సుపరిచితమే. అయితే ప్రపంచంలో మనుషులు పోలిన మనషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటాము. ఈ క్రమంలోనే మనం మనుషులను పోలిన మనుషులు ఒకరిద్దరని చూస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే అచ్చం బిత్తిరిసత్తి వేషధారణలో, అతని పోలికలతోనే, అతన్ని మాటతీరుతో వేములవాడలో సాయి కుమార్ అనే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఈ క్రమంలోనే తనను చూసిన ఎంతోమంది అచ్చం బిత్తిరి సత్తిని పోలి ఉన్నావంటూ అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

బిత్తిరి సత్తి తన మాట తీరుతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏదైనా సినిమాలు విడుదల అయితే ఆ హీరోలను తన మాట తీరుతో ఇంటర్వ్యూలు చేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఆయన మాట తీరును చూసి హీరోలు పడి పడి నవ్వుతున్నారు. తాజాగా మహేష్ బాబును ఇంటర్వ్యూ చేసిన బిత్తిరి సత్తి తన మాట తీరుతో మహేష్ బాబుని నవ్వించారు.అయితే మహేష్ బాబు ఇదివరకు అలా నవ్వడం తానెప్పుడూ చూడలేదని బిత్తిరి సత్తి కారణంగానే తన నవ్వుని చూశామని మహేష్ అభిమానులు ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ఇలా అందరినీ ఎంతో నవ్వించి సందడి చేస్తున్న బిత్తిరి సత్తి డూప్ ప్రస్తుతం సంచలనంగా మారారు.

వేములవాడలో సాయి కుమార్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ పూర్తి చేసి పెయింటింగ్ కాంట్రాక్ట్స్ తీసుకొని పెయింటర్ గా పని చేస్తున్నారు. అయితే ఈయన తరుచు బిత్తిరి సత్తి ప్రోగ్రామ్ లను చూస్తూ అతని అనుకరించేవారు. అచ్చం ఆయన వేషధారణలో,ఆయన మాట తీరుతో అందరినీ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వేములవాడ ప్రజలందరూ ఈతనను బిత్తిరి సత్తి అని పిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.ఈ క్రమంలోనే ఇప్పటికీ బిత్తిరి సత్తి రవన్నతో తాను రెండుసార్లు ఫోన్ లో మాట్లాడానని ఆయన వేషధారణలో పట్టణ నలమూలల తిరుగుతున్నప్పుడు తాను చేసే కామెడీ చూసి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్లు వరకు సంతోషంగా నవ్వడం చూసి తనకు చాలా సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా సాయి కుమార్ తెలిపారు.