Jeevitha Rajashekar: కూతురు గురించి నిజాలు చెప్తూ అందరిముంద శివానీ పరువు తీసిన జీవిత..!

Jeevitha Rajashekar: జీవిత రాజశేఖర్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరో రాజశేఖర్ ని వివాహం చేసుకున్న జీవిత అప్పటినుండి రాజశేఖర్ మంచి చెడులను చూస్తూ ఆయన వెన్నంటే ఉంటోంది. ఇక రాజశేఖర్ ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం రాజశేఖర్ శేఖర్ అనే సినిమాలో నటించాడు. జోసెఫ్ అనే మలయాళం సినిమాకి రీమేక్ గా శేఖర్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకి జీవిత గారు దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో వీరి కుమార్తె శివత్మీక కూడ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే17 వ తేదీ జరిగింది. ఈ ఈవెంట్ లో యూట్యూబర్ నిఖిల్ సందడి చేసాడు. ఈ ఈవెంట్ లో శివాని, శివాత్మికలకు ప్రశ్నలు వేస్తూ నిఖిల్ వారిని ఇరికించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నికిల్ మాట్లాడుతు.. రెడీ అవ్వటానికి ఎవరు ఎక్కువ సమయం తీసుకుంటారు అని అడగగా ..నేనే అని శివాని సమధానం చెప్తుంది.

Advertisement

ఇక మీ ఇద్దరిలో అమ్మ, నాన్నని ఎవరూ ఎక్కువ చిరాకు పెడతారు అని అడగ్గా..వాళ్ళిద్దరినీ నేనే చిరాకు పెడతాను అంటూ జీవిత సమాధానం చెప్తుంది. మధ్యలో శివా రెడ్డి రాజశేఖర్ వాయిస్ తో మాట్లాడుతూ.. వీళ్ళు ముగ్గురూ నన్ను ఇబ్బంది పెడతారు అని అనటంతో అందరు నవ్వుతారు. ఇక ఇద్దరిలో ఎవరూ ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారని అడగ్గా .. ఇద్దరు స్విగ్గి మీద ఫుడ్ కోసం బాగా కర్చు చేస్తారు అని జీవిత చెప్తూ.. ఒక్కోసారి ఆర్డర్ లేట్ అయితే శివానీ స్విగ్గీ వాళ్ళతో బాగ గొడవ పడుతుంది. ఒక్కోసారి డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తుందని చెబుతూ శివాని పరువు మొత్తం తీసింది.

Advertisement