...

Morning Astro Tips: ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు చేస్తున్నారా… వెంటనే ఆ అలవాటును మానుకోండి?

Morning Astro Tips:మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే కొన్ని పనులు చేయటం వలన ఎంతో శుభం కలుగుతుందని అలాగే మరి కొన్ని పనులు చేయటం వల్ల శుభం కలుగుతుందని భావిస్తారు. అయితే చాలా మందికి ఉదయం నిద్రలేవగానే కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. ఈ విధమైనటువంటి అలవాటు ఉండి, ఇలాంటి పనులు చేసేవారు వెంటనే మీ అలవాట్లను మానుకోండి లేదంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అలవాటు ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

చాలామందికి ఉదయం చాలా ఆలస్యం నిద్రలేస్తారు. సూర్యుడు ఉదయించిన తరువాత నిద్రలేవడం ఎంతో అశుభం. అందుకే సూర్యోదయానికి ముందే నిద్రలేచి మన రోజువారీ కార్యక్రమాలను పూర్తి చేయాలి. సూర్యోదయానికి ముందు నిద్ర లేచిన తరువాత మరి పడుకోకూడదు. ఇలా పడుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే ఉదయం నిద్ర లేవగానే అద్దంలో మొహం చూసుకోవటం. ముందుగా ఈ అలవాటును తప్పనిసరిగా మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఉదయం నిద్రలేవగానే అద్దంలో చూసుకోవడం పరమ దరిద్రం ఇలా చేయటం వల్ల ఎంతో ప్రతికూల ప్రభావం మనపై పడుతుంది.

అలాగే ఉదయం నిద్రలేవగానే సొంత నీడను చూసుకోవడం లేదా కుక్కలు పోట్లాడుతూ ఉండటం, అంతేకాకుండా మనసుకు ఆందోళన కలిగించే ఎలాంటి చిత్రపటాలను మనం చూడకూడదు. ఇక చాలా మంది ఉదయం నిద్రలేవగానే పాచి ముఖంతో సరాసరి వంటగదిలోకి వెళ్లి వంట చేయడం మొదలుపెడతారు. ముందుగా ఈ అలవాటును మానుకోవాలి అని పండితులు తెలియజేస్తున్నారు. నిద్ర లేవగానే వంటగదిలోకి వెళ్ళకుండా ముందుగా ముఖం శుభ్రం చేసుకుని వంట చేయడం ప్రారంభించాలి. ఇక చాలామంది రాత్రి భోజనం చేసిన గింజలను అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేస్తారు. ఇలా చేయడం అష్ట దరిద్రం. రాత్రి తిన్న గిన్నెలను రాత్రి శుభ్రంచేసి వంటగదిని శుభ్రంగా చేసి పడుకోవాలి. ఇలా ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కొన్ని పనులకు దూరంగా ఉండటం ఎంతో మంచిది.