...

Jr NTR: తెలంగాణ ఇంటర్ ప్రశ్నాపత్రంలో ఎన్టీఆర్ గురించి ప్రశ్న.. వైరల్ అవుతున్న క్వశ్చన్ పేపర్!

Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ ఉందని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇక ఈయన నటన పై ఎంతోమందితో ప్రశంసలు కూడా కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ ఇంటర్ పరీక్ష పత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర గురించి ప్రశ్నలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో త్రిబుల్ ఆర్ సినిమాలోని కొమరం భీమ్ పాత్ర గురించి ఒక వ్యాసం ఇచ్చి మీరు కొమరం భీమ్ ను ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి ఎలాంటి ప్రశ్నలు అడిగి.. సమాధానాలు రాబడతారు అంటూ ప్రశ్నించారు. ఇలా ఇంటర్ పరీక్ష పత్రంలో ఎన్టీఆర్ గురించి రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ తరుణంలోనే ఈ క్వశ్చన్ పేపర్ ను ఎన్టీఆర్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.

 

ట్విట్టర్ వేదికగా క్వశ్చన్ పేపర్ ఫోటోని వైరల్ చేస్తూ పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడి గురించి కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు దట్ ఇస్ ది పవర్ ఆఫ్ ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేయగా మరికొందరు తారక్ అన్నతో అట్లుంటది మరి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రశ్నాపత్రంలో ఇలా రాజమౌళి సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ప్రశ్న రావడంతో ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి ఎంతో క్రేజ్ సంపాదించుకుందని చెప్పాలి.