Not alowed to exam: ఇంటర్మీడియట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అని చెప్పిన అధికారులు దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే ఆమె వస్తున్న బస్సు పంక్చర్ అయి పది నిమిషాలు ఆలస్యం అవ్వడంతో పరీక్ష రాయనివ్వలేరు నిర్వాహకులు. అయితే ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ లోని ప్రబుత్వ జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది.
అయితే అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీ దేవి సోమవారం ఎకనామిక్స్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ నుంచి బస్సులో బయలు దేరింది. ఆ బస్సు మధ్య పంక్చర్ అవడంతో.. ఆమె పరీక్షా కేంద్రానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. అయితే నిబంధనల ప్రకారం అధికారులు లక్ష్మీ దేవిని పరీక్షకు అనుమతించలేదు. బస్సు ఫెయిల్ కావడం వల్లే పరీక్షకు ఆలస్యంగా వచ్చానని చెప్పిన నిర్వాహకులు వినిపించుకోలేదు. దీంతో లక్ష్మీ దేవి ధర్నా చేసింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాంలాల్ నాయక్ ఆమెకి సర్ది చెప్పి పంపించారు.