...

Pushpa Samantha Song : పుష్పలో స్పెషల్ సాంగ్ ‘సమంత’ చేయనన్నదట.. కానీ..! 

Pushpa Samantha Song : పుష్ప ది రైజ్ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ బ్లాస్టర్ హిట్ దిశగా దూసుకుపోతున్నది. కొవిడ్ తర్వాత ఈ రేంజ్‌లో సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతుండటంతో మూవీ మేకర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వీకెండ్‌లో పుష్పరాజ్ థియేటర్ల ముందుకు రావడంతో జనం ఎగబడుతున్నారు.

‘అల వైకుంఠపురం’ సినిమా హిట్ తర్వాత బన్నీ నేరుగా ప్యాన్ ఇండియా మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. డిసెంబర్ 17వ తేదిన పుష్ప ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వగా.. తొలుత ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది.  కాగా, ఈ వీకెండ్‌లో మరో అగ్ర హీరో సినిమా లేకపోవడంతో జనాలు పుష్పరాజ్ కోసం క్యూ కడుతున్నారు.

ఇప్పటికే పుష్ప ది రైజ్ మూవీ నైజాంలో బాహుబలి -2 రికార్డులు బ్రేక్ చేసిందని ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ సుకుమార్. అందుకోసం నటీనటులను కూడా డీ గ్లామరస్ పాత్రల్లో చూపించారు. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక చిత్తూరు నేటివిటికి తగ్గట్టు యాక్ట్ చేశారు. ఈ సినిమాలో సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే, ఈ మూవీలో సమంత ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఇది కాస్త వివాదాస్పదమైంది. పురుషుల మనోభావాలను దెబ్బతీశారని సమంతతో పాటు ఈ చిత్రంపై కేసు కూడా నమోదైంది.

అయితే, ఈ ఐటం సాంగ్‌లో నటించేందుకు సమంత ముందు ఓకే చెప్పలేదట.. ‘ఊ అంటావా మామ.. ఊఊ అంటావా’ అనే సాంగ్ కోసం ముందుగా వేరే యాక్టర్స్‌ను సంప్రదించిన దర్శకుడు సుకుమార్ చివరకు సమంత దగ్గరకు వచ్చి ఆగాడు. సామ్ చైతూతో విడాకులు తీసుకున్న బాధను మర్చిపోయేందుకు బిజీబిజీగా మారిపోయింది. అయితే, ఇందులో కనిపించడం తనకు ఇష్టం లేదని చెప్పగా..దర్శకుడు సుకుమార్ ఒత్తిడి మేరకు సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందట.. అలా ఈ స్పెషల్ సాంగ్‌లో సామ్ కనిపించి తన ఎద అందాలతో ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో ఉర్రూతలూగించింది.

Read Also : BJP Swetha Reddy : దేవి శ్రీ ప్రసాద్ చెత్త మ్యూజిక్ డైరెక్టర్.. శ్వేతారెడ్డి సంచలన కామెంట్స్..