...

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్… ఏంటంటే ?

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికి ఆయన అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఇటీవల గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. చిన్న వయసులోనే పునీత్ ఈ లోకాన్ని వీడటంతో ఆయన కుటుంబ సభ్యులు, కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. చేసింది తక్కువ సినిమాల్లోనే అయినా పవర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నారు పునీత్. అలానే సేవ కార్యక్రమాలతో సూపర్ స్టార్ గా నిలిచారు పునీత్. చివరగా యువరత్న సినిమాతో ప్రేక్షకులను అలరించారు ఆయన.

కాగా అతను చనిపోయే సమయానికి జేమ్స్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ‘ద్విత్వ’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. వీటిలో జేమ్స్ సినిమా పునీత్ చనిపోయే నాటికే పూర్తి కాగా… పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో పునీత్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకి చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్ గా నటించారు.

Puneeth Rajkumar : పునీత్ అప్పు.. జేమ్స్ రిపబ్లిక్ డే స్పెషల్..

నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా జేమ్స్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పునీత్ ఆర్మీ ఆఫీసర్ గెటప్ లో కనిపించారు. మిలిటరీ డ్రెస్ లో చేతిలో గన్ పట్టుకుని ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు పునీత్. ఈ పోస్టర్ కు ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది. అప్పూ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు అభిమానులు. పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఆ సమయంలో మరో సినిమా రిలీజ్ కాకుండా కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు.