Upasana Konidela Troll : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలపై భారీ ట్రోలింగ్ అవుతోంది. నెటిజన్లు ఉపాసనపై మండిపడుతున్నారు. అపోలో అధినేత మనవరాలిగా మెగా కోడలిగా రామ్ చరణ్ సతీమణిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక అంశాలపై స్పందిస్తూ బిజినెస్ లో రాణిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాసన.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టులను పెడుతుంటారు.. అయితే.. ఇటీవల ఉపాసన పెట్టిన ఓ పోస్టుపై నెటిజన్ల భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
దీనికి అసలు కారణం ఏంటేంటే.. ఆమె షేర్ చేసిన పోస్ట్ కారణమట.. గుడి గోపురం పైన దేవుళ్ల ఫోటోల బదులుగా సినీ స్టార్స్ బొమ్మలతో పెయింటింగ్ ఫొటోను పోస్టు చేయడమే.. ఈ పోస్టు చేసిన నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. మెగా ఫ్యాన్స్ సైతం ఉపాసన పోస్టుపై స్పందిస్తున్నారు.
Upasana Konidela : మెగా కోడలిపై భారీ ట్రోల్స్.. కారణం ఇదే..
మీరు ఇలాంటి ఫొటోలు పెట్టి మీ మీద ఉన్న గౌరవన్ని తగ్గించుకోకండని స్వీట్ గా హెచ్చరిస్తున్నారు. మీకు హిందూ దేవుళ్లపై ఎంత గౌరవం ఉందో తెలియడానికి మీరు చేసిన ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతుందని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫొటోలో సినీ హీరోలంతా గుడి గోపురంపై చెప్పులతో ఉన్నట్టుగా ఉంది.. నెటిజన్లు ట్రోల్ చేసినప్పటికీ ఉపాసన ఆ పోస్ట్ డిలీట్ చేయలేదు. దీనిపై ఉపాసన స్పందిస్తారో లేదో చూడాలి.
Read Also : Pushpa Srivalli Dance : తగ్గేదేలే.. బామ్మతో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును ఇరగదీశారుగా..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world