Petrol Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు పెట్రోల్, డీజిల్ లీటరుకు 40 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత 14 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది 12వ సారి. మార్చి 22 నుండి ఏప్రిల్ 4 వరకు 14 రోజుల్లో 12 సార్లు ధరలను పెంచాయి సంస్థలు. 2 వారాల్లో టరు పెట్రోల్ పై రూ.8లకు పైగా పెంచాయి చమురు సంస్థలు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.53గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.103.60గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.71గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.81గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 118.03గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.10గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.53గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.06గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.118.55కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.90లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.118.02ఉండగా.. డీజిల్ ధర రూ. 104.46గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.62లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.105.10గా ఉంది.
Read Also : Gold Prices Today : స్థిరంగా బంగారం ధరలు.. తెలంగాణ, ఏపీలో ఎంతో తెలుసా?