Portable AC : గతంలో ఏసీలు కేవలం సంపన్నుల ఇండ్లలో మాత్రమే ఉండేవి. కానీ ఈ మధ్య సామాన్య ప్రజలు కూడా ఏసీలు పెట్టించుకుంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే వీటి వినియోగం అతిగా పెరిగిపోతోంది. మధ్య తరగతి వాళ్లు కూడా ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. అయితే అద్దె ఇళ్లలో ఉండేవారు, ఇళ్లు చిన్నగా ఉండే వాళ్లు ఏసీ పెట్టించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ కేవలం ఒకే గదికి పరిమితమై ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్ లో కి వచ్చిన కొత్త ఏసీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిని ఎక్కడైనా తీసుకెళ్లొచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ ఫీచర్లు నచ్చిన వారంతా వీటిని కొనుగోలు చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
మామూలు ఏసీతో పోల్చితే పోర్టబుల్ ఏసీల ధర తక్కువగా ఉంటుందట. అలాగే సాధారణ ఏసీలు చాలా బరువుగా ఉంటాయి. వాటిని గోడకు అమర్చాల్సి ఉంటుంది. పోర్టబుల్ ఏసీల బరువు తక్కవగా ఉంటాయి. వీటికి ఉండే చక్రాల ద్వారా మనకు నచ్చిన చోట దీన్ని పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఈ పోర్టబుల్ ఏసీల మీదే దృష్టి పెట్టాయి. బ్లూస్టార్ పోర్టబుల్ ఏసీ 35 వేల రూపాయలకే వస్తుంది. వోల్టాస్, పిలిప్స్, ఉషా వంటి కంపెనీలు కూడా పోర్టబుల్ ఏసీలను తయారు చేస్తున్నాయి. ఫిలిప్స్ సిరీస్ కు చెందిన ఏసీ 25 వేలు పలుకుతోంది. ఉష లాంటి సంస్థ అయితే ఈ ఏసీని 12 వేలకే విర్కయిస్తోంది. పోర్టబుల్ ఏసీని మంచం దగ్గర పెట్టుకోవచ్చు. కుర్చీ పెట్టే స్థలంతో గది మొత్తాన్ని చల్లబరుస్తుంది. పోర్టబుల్ ఏసీ అద్దెకు నివసించే ఇళ్లలో కూడా సులువుగా పెట్టుకోవచ్చు. మీరు ఇంటిని మారాలనుకున్నప్పుడు కూడా దీన్ని సూట్ కేస్ లాగా మడిచి వెంట తీసుకెళ్లవచ్చు.
Read Also :Pre wedding diet: ప్రీ వెడ్డింగ్ పోయింది.. నయా ట్రెండ్ వచ్చేసింది!