...

Success story: ఇంట్లోనే ఉండి చదివి గ్రూప్-1 కొట్టాడు.. ఎలాగో మీరూ తెల్సుకోండి!

Success story: ఇంటి వద్దే ఉండి చదివాడు. ఎలాంటి కోచింగ్ లూ తీసుకోలేదు. నేరుగా గ్రూప్-1 లో విజేతగా నిలిచి ఉద్యోగం సంపాదించాడో యువకుడు. అతడే నల్గొండ జిల్లాకు చెందిన నూకల ఉదయ్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 2011 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సివిల్ పోస్టును సొంతం చేసుకున్నాడు. తనను పోలీసు అధికారిగా చూడాలనుకున్న తండ్రి, అన్నయ్యల కలను నెరవేర్చాడు. డిప్యూటీ కలెక్టర్ ను కాదని డీఎస్పీ పోస్టుకు ప్రాధాన్యం ఇచ్చాడు. 2011లో గ్రూప్-1 పరీక్షల్లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లినా.. సుప్రీంకోర్టు తీర్పుతో 2016లో మళ్లీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటి రెండో ర్యాంకు సాధించిన ఉదయ్ రెడ్డి సక్సెస్ స్టోరీ… మీకోసం.

తనకు చిన్నప్పటి నుంచి చదవుపై అంత ఆసక్తి లేకపోయినప్పటికీ… ఇంజినీరింగ్ లో చేరాక ఇండియన్ పోలీస్ సర్వీస్ సాధించాలనే తపన ఉండేదట. దీంతో ఇంజినీరింగ్ తొలి ఏడాది నుంచే సివిల్స్ కు సిద్ధమయ్యాడుట. ఇంజినీరింగ్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో నాలుగు ఉద్యోగాలు వచ్చినా… ఇన్ఫోటెక్ లో కోర్ సబ్జెక్ట్ అయిన ఎంబెడెడ్ సిస్టమ్ పై అవకాశం రావడంతో ఉద్యోగంలో చేరాడు. అయితే 9 నెలలు చేయగానే 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడిందట. దీంతో ఉద్యోగం మానేసి ప్రిపరేషన్ ప్రారంభించాడట. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంట్లోనే ఉండి కష్టపడి చదివాడట. అయితే ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన గ్రూప్-1 ప్రయాణంలో తన అన్నయ్య గౌతమ్ రెడ్డి తోడుగా ఉన్నాడని చెప్పాడు.

అయితే ఉద్యోగాల భర్తీపై కేసులు, మెయిన్స్ ను రద్దు చేసి, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం రాష్ట్ర విభజన పరిమాణాలు… ఇలా గ్రూప్ర్-1 అగమ్ గోచరంగా మారడంతో సివిల్స్ పై దృష్టి సారించాడట. 2015లో మెయిన్స్ రాశాడ. 2016లోనూ మెయిన్స్ కు అర్హత సాధించాడట. కానీ గ్రూప్-1 మెయిన్స్ రీఎగ్జామ్ కూడా అదే సమయంలో ఉండటంతో సివిల్స్ వదిలేసి గ్రూప్-1 మెయిన్స్ కు చదివి సెలెక్ట్ అయ్యాడట. ఇలా తనకు నచ్చిన పోలీసు ఉద్యోగాన్ని సంపాదించాడు.