Success story: చాలామందిలో వివిధ కారణాల వల్ల అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటారు.అయితే అంగవైకల్యం వల్ల వారిలో ఎలాంటి నైపుణ్యం ఉండదని వారు దేనికి పనికి రాదు అని తీసేయడం ఎంతో పొరపాటు. అంగవైకల్యం ఉన్న వారు నేడు దేశం గర్వించే స్థాయిలో ఉన్నారు.అయితే కొన్నిసార్లు ఈ అంగవైకల్యం కారణంగా ఎంతో మంది ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి అవమానాలు ఎదుర్కొన్న వారిలో నప్పిన్నై కంపెనీ స్థాపకుడు నైద్రోవెన్ ఒకరు.
నైద్రోవెన్ పుట్టుకతోనే మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్నారు.ఎన్నోసార్లు ఎన్నో వైద్యచికిత్సలు చేయించిన అప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన కేవలం వీల్ చైర్ కు మాత్రమే పరిమితం అయ్యాడు.అయితే ఇలా వీల్ చైర్ లో ఉన్న అతను అక్కడితో ఆగిపోకుండా మరో మెట్టు ముందుకు వెళ్ళాడు. సంకల్పబలం ఉంటే అవిటితనం మన ముందు తల వంచాలని ఇతను నిరూపించాడు. చదువు రీత్యా ఎంబీఏ పూర్తి చేసిన నైద్రోవెన్ ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ బతుకు కొనసాగించాలని భావించారు.ఈ విధంగా ఈయన ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో కేవలం అంగవైకల్యం కారణంగా ఆయనకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు.
ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసిన ఒకటి కూడా విజయవంతం కాకపోవడంతో ఏమాత్రం కృంగిపోకుండా పదేపదే ఆయన పట్టుదలను కొనసాగిస్తూ వచ్చారు.ఈ విధంగా తనకు కాళ్లు లేకపోవడంతో వృత్తిపరంగా ఇంజనీర్ అయిన ఆయన తండ్రి తన కొడుకు ఎవరిపై ఆధారపడకుండా ఉండటం కోసం కంపాక్ట్ స్కూటర్‌ను అభివృద్ధి చేశాడు అయితే దీని సహాయంతో అతను ఎవరిపై ఆధారపడకుండా తన పనిని తాను చేసుకునేవారు. ఈ విధంగా తనకు ఎవరు ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఈ ఆలోచనే తనని 2016లో నప్పిన్నై పేరుతో తన కొత్త స్టార్టప్‌ను నైద్రోవెన్ ప్రారంభించాడు. కుటుంబం స్నేహితులు ప్రభుత్వ సహకారంతో ఈ స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు.ఈ విధంగా తనకు ఎక్కడైతే ఉద్యోగం ఇవ్వమని రిజెక్ట్ చేశారో అలాంటి వారికి పోటీగా కంపెనీ ప్రారంభించి అందరూ గర్వించే స్థాయిలో ఉన్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World