NTR: ఈనెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎన్నో సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూసిన అభిమానులు ఈ సినిమా చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల పాటు సినిమా బృందం మొత్తం పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.
ఇదిలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ప్రేక్షకుల రెస్పాన్స్ గురించి జూనియర్ ఎన్టీఆర్ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ” వెలకట్టలేని మీ ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు.. మీ అభిమానమే నన్ను మరింత ముందుకు తీసుకెళుతోంది. విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అంటూ ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం తో కలిసి హైదరాబాద్లోని ఏ ఎం బి మాల్ లో సినిమా వీక్షించారు. ప్రేక్షకులతో కలిసి కుటుంబ సమేతంగా సినిమా చూడటం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన వెల్లడించారు.
రాజమౌళి, రామ్ చరణ్ ఇద్దరు భ్రమరాంబ థియేటర్ లో సినిమా చూడటానికి వెళుతూ అభిమానుల నుంచి తప్పించుకోవటానికి నానా తంటాలు పడ్డారు .ఈ క్రమంలో రామ్ చరణ్ కూడా ఊడిపోయింది. ఈ క్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ అభిమానులతో కలిసి ఇలా రారా సినిమా చూడటం చాలా సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా సినిమా చూస్తూ ప్రేక్షకుల మీద పేపర్లు చల్లుతూ రచ్చ రచ్చ చేశారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World