తెలంగాణలోని 22 జిల్లా జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. జిల్లా జడ్జిల్లో 13 మందిని నేరుగా.. మరో 9 మంది సీనియర్ సివిల్ జడ్జిలకు నియామక పరీక్ష ద్వారా పదోన్నతి పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మే 2 వరకు సీఎస్ కార్యాలయానికి దరఖాస్తులను సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులు జిల్లా జడ్జి ఉద్యోగానికి అర్హులని తెలిపింది.
రాత పరీక్ష, వైవా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మరో 9 జిల్లా ఉద్యోగాల పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న సీనియర్ సివిల్ జడ్జిలను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. అయితే మొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు జరిగిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ న్యాయ వాదులు, జడ్జిల గురించి పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణ న్యాయవాదులు, జడ్జిల కోసం హకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.