Ranabir, alia wedding gifts : బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భచ్ ఈనెల 14న పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి.. కన్నుల పండువగా సాగింది. అయితే చాలా మంది సినీ ప్రముఖులు వీరి పెళ్లికి రాకపోయినప్పటికీ ఖరీదైన బహుమతులు పంపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కత్రినా కైప్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా సహా పలువురు సెలబ్రిటీలు కాస్ట్లీ గిఫ్ట్స్ పంపినట్లు తెలిసింది. అయితే అందులో ముఖ్యంగా రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ ఇచ్చిన బహుమతి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
ముంబయిలోని ఓ విలాసవంతమైన అపార్టుమెంట్‌లోని సిక్స్ బెడ్ రూమ్ ప్లాట్‌ను ఇచ్చిందట! దాని విలువ దాదాపు రూ.26కోట్లు అని బాలీవుడ్ సర్కిల్ టాక్. కాగా, రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ కత్రినా-రూ.14లక్షల ప్లాటినం బ్రాస్లెట్, దీపికా పదుకొణె రూ.15లక్షల కపుల్ వాచ్, ప్రియాంక చోప్రా రూ.9లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ఇచ్చారని తెలిసింది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా రూ.3 లక్షల హ్యాండ్‌బ్యాగ్, వరుణ్ ధావన్ రూ.4లక్షల గూచీ హై హీల్ చెప్పు, అర్జున్ కపూర్ లక్షన్నర విలువ చేసే గూచీ జిప్పర్ జాకెట్‌ను కానుకలుగా ఇచ్చారని సమాచారం.
Read Also :