Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే తులసి చుడీదార్ వేసుకుని ఇంట్లో నుంచి బయలుదేరుతుండగా అనసూయ దంపతులు అలా తులసి ను చూసి ఎంతో ఆనందంగా నవ్వుకుంటారు. ఈ క్రమంలో దివ్య కూడా ఎంత ఆనంద పడుతుంది. ఇక అనసూయ నన్ను మీ మమ్మీ ని ఒక ఫోటో తీయమని అంటుంది.
దివ్య వాళ్ళ తల్లి ని రకరకాల స్టిల్స్ తో ఫోటోలు తీస్తుంది. ఇక తులసి ఎక్కడికి వెళుతున్నారు అత్తయ్య అని అడుగుతుంది. అనసూయ గుడికి అమ్మ అని చెబుతుంది. నీకు అంతా మంచే జరగాలని దేవుడిని కోరుకోవడానికి వెళుతున్నాము అని అంటారు.
ఇక తులసి ఇంటర్వ్యూకు బయలుదేరుతున్న సంగతి తెలిసి శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు అని అనసూయ దీవిస్తుంది. ఆ తర్వాత ప్రవళిక ఫోన్ చేయగా గచ్చిబౌలి లో ఒక కంపెనీకి ఇంటర్వ్యూ కి వెళుతున్నాను ఆ తర్వాత కలుసుకుందాం అని తులసి ప్రవళిక కు చెబుతుంది. మరో వైపు నందు తన ఫ్రెండ్ కంపెనీలో ఆపరేషన్ మేనేజర్ గా సెలెక్ట్ అవుతాడు.
ఇక అదే కంపెనీకి ఇంటర్వ్యూ కోసం తులసి వస్తుంది. ఇక ఇంటర్వ్యూ రూమ్ లో తులసి నందు ని పేస్ చేస్తుంది. ఇక తులసి చదువు లేకపోయినా లోక జ్ఞానం ఎంతో కష్టపడి బిజినెస్ చేశాము అని ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి చెబుతుంది. ఇక పక్కనే ఉన్న నందుకి ఆ మాటలు కొంచెం అసౌకర్యం గా ఉంటాయి.
ఇక మీరు నాకు ఎలాంటి పనైనా ఇవ్వండి కష్టపడి చేస్తాను అని అంటుంది. అంతేకాకుండా ప్లీజ్ అని బ్రతిమిలాడు తుంది. దాంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీ ఆయన ఏం చేస్తాడు అని అడుగుతాడు. ఇక తులసి ఆయన వేరే ఒకరిని ఇష్టపడ్డాడు అందుకని నాతో గొడవ పడ్డాడు అని చెబుతోంది.
ఇక నా బతుకు నేను బ్రతకాలనుకుంటున్నాను అని అంటుంది. ఆ క్రమంలో చదువు లేదు.. బ్రతికే ఆధారం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు అతనికి దూరం అయ్యావు అని ఆ వ్యక్తి అడుగుతాడు. దాంతో తులసి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ కాలిని తీసేయ్యకపోతే మొత్తం శరీరానికి ప్రమాదం అందుకే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అంటుంది.
ఆ మాట విన్న నందు మనసులో ఎంతో కోపం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తులసి వెళ్ళిపోతుంది. ఇక నందు తను నా భార్య అని తన ఫ్రెండ్ కి చెబుతాడు. దాంతో నందు ఫ్రెండ్ తులసి ని వెనక్కి పిలిపించి మీరు నందు భార్య అంటే ఇంటర్వ్యూ కూడా చేసే వాడిని కాదు అని అంటాడు.
ఇక తులసి నందు భార్యగా నాకు ఈ జాబ్ అవసరం లేదని చెబుతుంది. ఈ క్రమంలో నందు అసలు రూపం తన ఫ్రెండు ముందు బయట పెడుతుంది. ఇక నందు ఫ్రెండ్ నందుని అసహ్యించుకుంటాడు. ఆ తర్వాత నందు అయ్యో.. అని నీకు సహాయం చెస్తే నా పరువు తీసేలా మాట్లాడావు అని తులసి ను అంటాడు.
ఇక తులసి తరువాయి భాగం లో ఎగిరే పావురాలను చూసి దేవుడు నాకు కూడా అటువంటి అదృష్టం ఇస్తే బావుండు అని ప్రవళిక తో అంటుంది. ఇక ప్రవళిక ఆ అదృష్టం నేనే ఇస్తాను అని తులసి జాలీగా కారు లో తిప్పుతుంది. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World