Kajal Agarwal:వెండితెర చందమామకు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గతనెల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు మదర్స్ డే కావడంతో కాజల్ అగర్వాల్ కు నేడు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.తన కుమారుడు పుట్టిన తర్వాత వచ్చిన మొదటి మదర్స్ డే ను కాజల్ మొదటి సారిగా తన కుమారుడు నీల్ కిచ్లూను అభిమానులకు పరిచయం చేస్తూ ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కాజల్ తెలియచేస్తూ.. నువ్వే నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రానీవి నిన్ను పొందడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఈమె ఈ లేఖలో రాసుకొచ్చారు. అదేవిధంగా నేను రాసిన ఈ మొదటి లేక నాకు నువ్వు ఎంత ముఖ్యమైన వాడివో తెలియ జేయాలి అనుకుంటున్నాను. ఎప్పుడైతే నీ చిన్ని చేతులను నా చేతిలోకి తీసుకున్నానో అప్పుడే నీ ప్రేమలో పడిపోయాను. నీ అందమైన కళ్ళల్లోకి చూస్తూ నువ్వే నా ప్రపంచం అని భావించాను.రాబోయే సంవత్సరాలలో మీకు ఎంతో నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను అంటూ కాజల్ ఈ లేఖలో రాసుకొచ్చారు.
అదేవిధంగా నువ్వు జన్మించి ఒక తల్లిగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలో నాకు తెలియ చేశావు.నీవు నాకు నిస్వార్థంగా ఉండాలని నేర్పించావు ఇంకా నీ నుంచి నేను ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. నువ్వే నా రాజకుమారుడువి నువ్వు నీ జీవితంలో ఎంతో దృఢంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తన కుమారుడు గురించి తెలియజేస్తూ కాజల్ అగర్వాల్ సుదీర్ఘమైన లేఖ రాశారు.ఇలా కాజల్ అగర్వాల్ తన కొడుకు గురించి తెలియజేస్తూ తన కొడుకు ఫోటోను షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.