Password : రోజురోజుకు సైబర్ నేరగాళ్లు విపరీతంగా ఎంతోమంది పాస్ వర్డ్ లను హ్యాక్ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మోసాలకు చెక్ పెట్టడం కోసం పాస్‌వర్డ్ లేని లాగిన్ వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుంది. ఇలా పాస్‌వర్డ్ లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి మోసాలకు చెక్ పెట్టవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు అన్నీ ఇదే దిశ వైపు అడుగులు వేస్తున్నాయి. ఒక యాప్ కు సపరేట్ పాస్ వర్డ్ కాకుండా అన్ని యాప్స్ కి కలిపి ఓకే యూనిక్ పాస్వర్డ్ ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
ఈ క్రమంలోనే ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు పాస్‌వర్డ్‌లెస్ సైన్‌ఇన్ టెక్నాలజీని తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.విండోస్, క్రోమ్‌ఓఎస్, మ్యాక్‌ఓఎస్ వంటి భిన్న డివైజ్‌లలో యాప్స్, వెబ్‌సైట్లలో ఒకేసారి లాగిన్ అయితే ఎంతో సురక్షితమైన ఈ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు ఇలా ఒక సారి లాగిన్ అయితే అన్ని సైట్లు, యాప్‌లకు యాక్సెసింగ్ లభిస్తుంది. పనిపూర్తయిన తర్వాత లాగౌట్ అవ్వచ్చు.
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ లో మనం ఉపయోగిస్తున్న ఎటువంటి ఫింగర్ ప్రింటింగ్ ఫేస్ స్కాన్ వంటి లాగిన్ ద్వారా ‘పాస్‌వర్డ్‌లెస్ సైన్‌ఇన్’ టెక్నాలజీలోకి లాగిన్ కావొచ్చు. ఇలా లాగిన్ కావాలంటే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి పాస్ వర్డ్ లెస్ సైన్ ఇన్ టెక్నాలజీ తీసుకువస్తే ఎన్నో సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. త్వరలోనే యాపిల్ గూగుల్ మైక్రోసాఫ్టు వంటి కంపెనీలు మరికొన్ని అధునాతనమైన ఫీచర్లు జోడించి దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
Read Also : Anchor Anasuya: వామ్మో.. ఒక్కరోజు కాల్షీట్ కోసం అనసూయ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Tufan9 Telugu News And Updates Breaking News All over World