Ktithi Shetty: కృతి శెట్టిని దారుణంగా అవమానించిన స్టార్ హీరో..గ్లామర్ ఒలకబోస్తోందా అంటూ కామెంట్స్!

Ktithi Shetty:ఉప్పెన సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈమె నటించిన సినిమాలు నాని శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈమె నితిన్ మాచర్ల నియోజకవర్గం, రామ్ ది వారియర్, అలాగే సూర్య సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement

ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కృతిశెట్టి తన మేనేజర్ లపై అధిక ఒత్తిడి తీసుకు వస్తుందని సమాచారం. తనకు స్టార్ హీరోలైన మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోల సరసన నటించే అవకాశాలు తీసుకురావాలని మేనేజర్ లను ఒత్తిడికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన ఒక హీరో తనకు అలాంటి అవకాశాలు వచ్చేందుకు తనేమైనా స్క్రీన్ పై గ్లామర్ ఒలకబోస్తుందా… లేక తను ఏమైనా బాగా పరిణితి చెందిన హీరోయిన్ నా అంటూ ఒక స్టార్ హీరో డైరెక్టర్ ద్వారా ఇండైరెక్ట్ గా తనకు క్లారిటీ ఇస్తూ ఉప్పెన ముద్దుగుమ్మను దారుణంగా అవమానించారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన కృతి శెట్టి అభిమానులు అవకాశాలు రావాలంటే నటనలో నైపుణ్యం ఉండాలి కానీ నటనలో పరిణితి చెందాల్సిన పని లేదని అలాగే గ్లామర్ కూడా ఒలకపోయాల్సిన పనిలేదని కామెంట్లు చేస్తున్నారు. అయితే కృతి శెట్టిని ఇలా అవమానించిన ఆ హీరో ఎవరు అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.

Advertisement
Advertisement