Viral video: అడవికే రాజు సింహం. దాని ఆధిపత్యం ఆ రేంజ్ లో ఉంటుంది. జూలు విదుల్చుకుని… గాండ్రింపు చేస్తూ అలా నడిచి వస్తుంటే గుండె అరి కాళ్లకు జారుతుంది. దాని రూపం చూస్తేనే ఒళ్లు వణుకుతుంది. అలాంటిది ఓ వ్యక్తి చేసిన పనికి మృగరాజు తోక ముడవాల్సి వచ్చింది.
కర్రతో ఉన్న వ్యక్తిని చూసి భయంతో సింహం పరుగెత్తింది. యానిమల్స్ పవర్స్ అనే ఇన్ స్టాగ్రాం పేజీలో పోస్టు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాని చూసి చాలా మంది ఆసక్తిగా తిలకిస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏం ఉందంటే… అటవీ ప్రాంతంలో ఒక మగ సింహం ఉంటుంది. ఒక వ్యక్తి ఒంటరిగా అక్కడికి వెళ్లాడు. సింహాన్ని చూసి కోపంగా చేతిలోని కర్రతో దాన్ని భయపెట్టాడు.
తనను భయపెట్టిన వ్యక్తిని సింహం ఏం చేయలేదు. పైగా అతని చేతిలో ఉన్న కర్రను చూసి భయపడి పోయింది. ఆ ఒంటరి వ్యక్తి కర్రతో వెంటపడగా అక్కడి నుంచి పారిపోయింది. ‘మనిషిని చూసి సింహం భయపడింది’ అన్న శీర్షికతో ‘యానిమల్స్ పవర్స్’ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే సుమారు 8 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 54 వేలకుపైగా లైక్ చేశారు. మనిషిని చూసి సింహం భయపడటంపై నెజిటన్లు షాకయ్యారు. ఆ వ్యక్తికి చివరి కోరిక ఏదో మిగిలి ఉందని, అందుకే సింహం అతడిపై దాడి చేసి తినేయకుండా వదిలేసిందని ఒకరు చమత్కరించారు. కాగా, ఆ వ్యక్తి కర్రతో సింహాన్ని బెదిరించడాన్ని యానిమల్ లవర్స్ తప్పుపట్టారు. ఇలా వన్యప్రాణులను భయపెట్టడం తప్పని చెబుతున్నారు.
View this post on Instagram