Janaki Kalaganaledu : సంతోషంలో జ్ఞానాంబ కుటుంబం.. మల్లికను దగ్గరికి తీసుకున్న జ్ఞానాంబ..?

Janaki Kalaganaledu March 4 Today Episode
Janaki Kalaganaledu March 4 Today Episode

Janaki Kalaganaledu March 4 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.. బయటకు వెళ్లిన జానకి, రామచంద్ర లను ఎలా అయిన పట్టుకోవాలి అని అక్కడే పడిగాపులు కాస్తూ ఉంటుంది మల్లిక.

Janaki Kalaganaledu March 4 Today Episode
Janaki Kalaganaledu March 4 Today Episode

మరొకవైపు జానకి, రామచంద్ర ఇంటికి వచ్చి ఉండగా మధ్యలో వర్షం పడుతుంది. అప్పుడు ఇద్దరూ ఒకరికొకరు అనుకోకుండా టచ్ అవుతారు. అనంతరం వర్షం తగ్గగానే ఇంటికి బయలుదేరుతారు. మరొకవైపు మల్లిక ఎలా అయినా జానకిని జ్ఞానాంబ ముందు దోషిగా నిలబెట్టాలని వెయిట్ చేస్తూ ఉంటుంది.

Advertisement

ఇక వారికోసం ఎదురు చూసి మల్లిక ఆ గోడ దగ్గర మెల్లగా నిద్ర లోకి జారుకుంది. ఇక అంతలో రామచంద్ర జానకి సైలెంట్ గా గోడదూకి ఒక్కసారిగా అక్కడ ఉన్న మల్లికను చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతారు.

ఇక మరుసటి రోజు ఉదయం పనిమనిషి వచ్చి మల్లికను ఫన్నీగా నిద్ర లేపుతుంది. రాత్రి తను పడ్డ కష్టమంతా వృథా అయింది అని మల్లికా బాధపడుతూ ఉంటుంది. కానీ ఎలా అయినా సరే ఆ దొంగలను పట్టుకున్న అని పనిమనిషి చెబుతుంది. మరొకవైపు జ్ఞానాంబ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతారు కుటుంబ సభ్యులు.

Advertisement

Janaki Kalaganaledu March 4 Today Episode : జానకి, రామచంద్ర లను ఎలా అయిన పట్టుకోవాలని..

దానికి జ్ఞానాంబ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తారు. అప్పుడు రామచంద్ర తండ్రి ఇదంతా ఎవరు చేశారు అని అడగగా, ఇదంతా జానకి ప్లాన్ అని చెబుతాడు రామచంద్ర. ఇక అప్పుడు మల్లిక ఫీల్ అవుతూ ఏడుపు మొహం పెడుతుంది.

ఇంతలో జ్ఞానాంబ, మల్లిక, జానకి లను దగ్గరికి తీసుకొని మీరిద్దరూ నాకు కోడళ్లే, ఇద్దరిని సమానంగా చూసుకుంటాను అని అంటుంది. అనంతరం జ్ఞానాంబ ఇంట్లో వారి పెళ్లి చూపులు ఏ విధంగా జరిగాయో ఒకసారి ఫన్నీగా ఫ్యామిలీ మొత్తానికి చూపిస్తారు. అలా జ్ఞానాంబ కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..

Advertisement

Read Also : Janaki Kalaganaledu : జానకి, రామచంద్ర లు గోడదూకిన విషయాన్ని జ్ఞానాంబతో చెప్పిన మల్లిక..?

Advertisement