Devatha May 21 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దేవి, తల్లి రాధ ను రాధమ్మ అని పిలిచి నాకు మా అమ్మాయి ఎవరో తెలుస్తలేదు అని అనడం తో రాధమ్మ బాధపడుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో రాధ దేవి అన్న మాటలను తలచుకుని బాధ పడుతూ ఉంటుంది. దేవి టిఫిన్ చేస్తుండగా దేవి ని చూస్తూ అలా ఎలా అనుకున్నావ్ అమ్మ అని బాధ పడుతుంది. నేనే నీకు సొంత అమ్మ అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది అనుకోలేదు అని లోలోపల కుమిలిపోతుంటుంది రాధ.
Devatha May 21 today episode
మరొకవైపు దేవుడమ్మ ఒంటరిగా కూర్చొని భాగ్యమ్మ అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాజమ్మ అక్కడికి వచ్చి భాగ్యమ్మ అన్న మాటలను చెబుతుంది. భాష, కమల వాళ్ళు వారికి పుట్టిన బిడ్డను ప్రత్యేకత తీస్తామని అనడంతో భాగ్యమ్మ ఒప్పుకోలేదని దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఎలాగైనా కని పెడతాను అని అంటుంది.
మరొకవైపు మాధవ తన గదిలో ఒక బోర్డు లో తన మొదటి భార్య ఫోటోని చూసుకొని ఎమోషనల్ అవుతున్నట్లు నటిస్తాడు. ఇక పక్కనే దేవి మాధవ మాటలు వింటూ ఉంటుంది. ఇక మాధవ దేవి వింటుంది అని మాయ మాటలు మాట్లాడి అక్కడినుంచి ఎమోషనల్గా ఏడ్చుకుంటూ వెళ్తాడు.
ఆ తర్వాత దేవి మాధవ మాటలు విని ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఫోటో చూస్తుంది. దేవి ఆ ఫోటో చూసి ఆమె తన తల్లి అని అనుకుంటుంది. మాధవ తన ప్లాన్ సక్సెస్ అయింది అని సంతోష పడతాడు. మరొకవైపు ఆదిత్య ఒంటరిగా కూర్చొని ఉండగా అక్కడి నుంచి దేవుడమ్మ, సత్యను హాస్పిటల్ కి తీసుకొని వెళుతుంది.
ఎందుకు అని అడగడంతో పిల్లల విషయం అని చెప్పడంతో ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు ఆదిత్య నేను గతంలో చూపించాను కదా అని అడగగా దేవుడమ్మ తన ఊర్లో కలిసినప్పుడు పూజారి ఈ విధంగా చెప్పాడు అని అంటుంది. మరొక వైపు రుక్మిణి బతికే ఉంది అని అనడంతో దేవుడమ్మ ఆశ్చర్యపోగా ఆ మాటలు పూజారి కూడా నిజం అని చెప్పడంతో దేవుడమ్మ సంతోషంగా వెళ్లి ఆ మాటలను సత్య ఆదిత్య లకు చెబుతుంది.
అప్పుడు సత్య అవును అది నిజమే కానీ నీకు ఎలా చెప్పను అని మనసులో అనుకుంటుంది. ఆదిత్య కూడా ఆ మాట విని చాలా బాధపడతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Intinti Gruhalakshmi Kasturi: నాలుగు పదుల వయసులో కూడా క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేస్తున్న హీరోయిన్!