Devatha May 31 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ రామ్మూర్తి,జానకి, మాధవ లను బయటకు పిలుచుకొని వెళ్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య, దేవిని కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. దేవి కూడా సంతోషంగా ఆదిత్య తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య దేవి ని ఎందుకు దేవి ఎలా ఉంటున్నావు..ఏమయింది అని ప్రశ్నించగా అప్పుడు దేవి మాధవ చెప్పిన మాటలు అని చెప్పడంతో ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు.
అప్పుడు ఆదిత్య, దేవికి నచ్చ చెబుతాడు. అమ్మను ఎప్పటికీ అలా అనవద్దు. అమ్మను ప్రేమగా చూసుకోవాలి అంటూ దేవి మనసులో ఉన్న బాధను తొలగిస్తాడు. మరొక వైపు రామ్మూర్తి దంపతులు మాధవ, రాధ కలిసి ఒక చోటికి వెళ్తారు. అయితే దారిపొడవునా రాధ ను రామ్మూర్తి దంపతులు, మాధవ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగినా కూడా చెప్పదు.
ఇక చివరికి రాధ మాధవ కు పెళ్ళిచూపులు ఏర్పాటు చేసింది అని అర్థమవుతుంది. ఇంతలో పెళ్ళికూతురు తండ్రి వచ్చి రామ్మూర్తి కుటుంబాన్ని లోపలికి ఆహ్వానిస్తాడు. ఇక రామ్మూర్తి ఫామిలీ ఏమీ అర్థం కాకపోవడంతో అయోమయంగా ఉంటారు. ఇంట్లోకి వెళ్ళగానే అక్కడున్నవారంతా రామ్మూర్తి ఫ్యామిలీని బాగానే మాట్లాడిస్తారు.
ఇక అప్పుడు పెళ్లి చూపులు అని వారికి తెలియడంతో షాక్ అవుతారు. అప్పుడు మాధవ స్టన్ అవుతాడు. రాధ వైపు కోపంగా చూస్తూ ఉండగా వియ్యంకుల మాత్రం మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇంతలో పెళ్లికూతురు రావడంతో రామ్మూర్తి దంపతులు తెగ కంగారు పడుతూ ఉండగా అమ్మాయికి మాధవ నచ్చినట్లు కనిపించడంతో, అప్పుడు పెళ్లికూతురు తరఫున వాళ్ళు అమ్మాయి నచ్చిందా లేదా అని అడగగా అప్పుడు మాధవ ఇంటికి వెళ్లి ఫోన్ చేసి చెబుతాను అని తల్లిదండ్రులను తీసుకొని బయటికి వెళ్తాడు.
మరొకవైపు కమల,సత్య ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఆదిత్య చాలా ఉత్సాహంగా అక్కడికి వచ్చి కొంత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మరొక వైపు మాధవ కుటుంబం ఇంటికి చేరుకున్న తర్వాత రాధను ఎందుకు ఇలా చేశారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ మాధవ మాత్రం మౌనంగా ఉంటాడు.
అప్పుడు రాధ మాట్లాడుతూ మీ కొడుకు గురించి ఆలోచించండి నా గురించి ఆలోచించడం పక్కనపెట్టండి. అందుకే నేను ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను ఈ అమ్మాయి నచ్చకపోతే మరొక అమ్మాయిని చూసుకుందామని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also :Devatha May 30 Today Episode : దేవితో కలిసి ఆడుకుంటున్న భాగ్యమ్మ.. బాధతో కుమిలిపోతున్న రాధ..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World