Shravana masam 2022 : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మానవ జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మనం ఎంత ఆధునికంగా జీవిస్తున్నా, ప్రజల్లో కొన్ని నమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజలకు జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువ. లయకారుడు అయిన శివుని అనుగ్రహం పొందితే ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందుతారని కూడా భావిస్తుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడికి నాలుగు రాశులు చాలా ఇష్టమని తెలుస్తోంది. ఈ సంవత్సరం ఈ రాశుల వారు శివుడి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. అయితే ఆ నాలుగు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి.. మేష రాశిని అంగారకుడు పాలిస్తాడు. ఈ అంగారక గ్రహాన్ని శివునిలో భాగంగా పరిగణిస్తారు. అందుకే ఈ రాశుల వారు శివుని విశేష అనుగ్రహాన్ని పొందారు. ప్రతీ సోమవారం ఈ రాశి వారు శివుడిని పూజిస్తే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.
వృశ్చిక రాశి.. ఈ రాశికి కుజుడు అధిపతి.. ఈ రాశుల వారిపై కూడా శివుడి అనుగ్రహం ఉంటుంది. వృశ్చిక రాశి వారు సోమ వారాల్లో శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అన్ని రకాల భయాలు వీరిని తొలగిపోతాయి.
మకర రాశి.. శివుడిని ఇష్టమైన రాశుల్లో ఇది కూడా ఒకటి. ఈ రాశికి శని అధిపతి. శనీశ్వరుడు పరమ శివ భక్తుడు. కాబట్టి మకర రాశి వారికి శివుని అనుగ్రహం తప్పక ఉంటుంది. వీరు సోమవారాలు బిల్వ ఆకులతో, ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుందట.
కుంభ రాశి.. ఈ రాశికి కూడా అధిపతి శనియే. కుంభ రాశి వాళ్లు కూడా సోమ వారాల్లో శివుడిని పూజిస్తే.. సులభంగా అన్ని కోరికలను నెరవేర్చుకోవచ్చు. అది కూడా కుంభ రాశి వారు సోమవారాల్లో శివలింగానికి జలాభిషేకం చేస్తే కోరిన వరం కల్గుతుంది.
Read Also : Horoscope: ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి లక్కే లక్కు..!