Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
జానకి కలగనలేదు, దేవత సీరియల్ హీరోలు అయినా ఆదిత్య,రామ చంద్ర లు ఈవెంట్ మేనేజర్ అయిన గంధం గజాలను ఎలా అయినా ఆట పట్టించాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు. ఆ తర్వాత లాస్య తనకు జరిగిన అవమానానికి పగ తీర్చుకోవడం కోసం తులసిపై సరికొత్త ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ను దివ్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇంతలో శృతి అక్కడికి రావడంతో శృతికి జరిగినదంతా వివరిస్తుంది దివ్య.
మరొకవైపు అక్షర పెళ్లి రిసెప్షన్ లో కూతుర్ని తలుచుకొని ఎమోషనల్ అవుతాడు జీకే. అనంతరం జి కే భార్య భర్తల బంధం గురించి గొప్పగా చెబుతుండడంతో నందు సిగ్గుతో తలదించుకుంటారు. ఆ తర్వాత ఆ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వడం తో అక్కడ ఉన్న వారందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరొకవైపు లాస్య తాను అనుకున్న ప్రకారం తులసి తాగే జ్యూస్ లో మందు కలుపుతుంది.
దూరం నుంచి చూసిన దివ్య,శృతి లు అడ్డుపడి ఆపే లోపు ఆ కూల్ డ్రింక్ ను తాగేస్తుంది. ఆ తర్వాత ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ హీరోయిన్ వేద డాన్స్ ఇరగదీసింది. అనంతరం ఆదిత్య, రామచంద్ర లు ఈవెంట్ మేనేజర్ ని డాన్స్ తో ఒక ఆట ఆడుకుంటున్నాడు. లాస్య పంపించిన జ్యూస్ తాగిన కూడా తులసి మధ్య లోకి వెళ్లకుండా నార్మల్ గానే ఉంటుంది.
ప్లాన్ అంతా ఫెయిల్ అయింది అని లాస్య బాధ పడుతూ ఉండగా ఇంతలో శృతి, దివ్య లు అక్కడికి వచ్చి లాస్య కు మాయమాటలు చెప్పి, లాస్య మందు కలిపిన కూల్ డ్రింక్ ని లాస్య తోనే తాగిస్తారు. అయితే లాస్య కలిపిన మందు కూల్ డ్రింక్ శృతి, దివ్య లు తెలివిగా మార్చేస్తారు. మందు కలిపిన కూల్ డ్రింక్ ను తాగిన లాస్య తాగిన మైకంలో ఒళ్ళు మరిచిపోయి చిందులు వేస్తుండడంతో అందరూ షాక్ అవుతారు.
అవమానంగా భావించిన నందు, లాస్య ను పక్కకు లాక్కొచ్చి ప్రయత్నం చేయగా నందు ని పక్కకు నెట్టేస్తుంది లాస్య. ఆ తర్వాత తులసి లాస్య ను వెళ్లి ఆపడానికి ప్రయత్నించగా అడ్డుకున్న దివ్య జరిగిందంతా వివరిస్తుంది. అయినా కూడా తులసి వినకుండా లాస్య ను పక్కకు తీసుకువచ్చి ముఖంపై నీళ్లు చళ్ళుతుంది.
లాస్య ను గట్టిగా మందలిస్తుంది తులసి. అంతా నీవల్లే అన్నట్టుగా మాట్లాడుతుంది లాస్య. ఇక నీ విన్యాసాలు చూడలేక ముందు నేను ఇక్కడే వదిలేసి వెళ్లిపోయాడు అని తులసి అనడంతో తాగిన మైకం లో మరింత రెచ్చిపోయిన లాస్య రోడ్డున పడతావు అంటూ తులసిని హెచ్చరిస్తుంది. నేను కాదు మరికొన్ని రోజులలో నేను అనుభవిస్తున్న శిక్షణ ను నువ్వు కూడా అనుభవిస్తావు నిన్ను కూడా నందు వదిలేస్తాడు ఖాయం అది రాసి పెట్టుకో అని చెబుతుంది తులసి. అప్పుడు లాస్య నిన్ను ఒంటరిదాన్ని చేస్తాను అంటూ తులసితో శపథం చేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.