...

Junior ntr: కొరటాలకు షాకిచ్చిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్..!

Junior ntr: ఆర్ఆర్ఆర్ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నారు తారక్. తన కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ సొంతం చేుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ లో జూనియర్ నటన చాలా మందిని ఆకట్టుకుంది. కొమురం భీముడో సాంగ్ లో తారక్ నటన చూసి ఈలలు వేయని వారు లేరు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రధాన పాత్రలతో ఆచార్య సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కొరటాల శివ. కొరటాల మూవీ సినీ ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. బాక్సాఫీస్ ముందు చతికిల పడింది. ఆర్ఆర్ఆర్ తో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన తారక్.. తన తర్వాతి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. అయితే శివ తెరకెక్కించిన ఆచార్య బొల్తా కొట్టడంతో ఇప్పుడు తారక్ శివకు ఝలక్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

తారక్ కెరీర్ లో తర్వాత సినిమా 30 వది కావడంతో అటు ఇండస్ట్రీలో ఇటు అభిమానుల్లో హైప్ క్రియేట్ అయ్యింది. శివ తెరకెక్కించిన ఆచార్య ఫ్లాప్ కావడంతో ఆ ప్రభావం తన తర్వాత మూవీపై ఎలా ఉంటుందోనని ఆలోచించిన తారక్… శివకు చిన్న ఝలక్ ఇచ్చారని అంటున్నారు. తన నెక్స్ట్ మూవీ కోసం కొరటాలను మరింత సమయం తీసుకోవాల్సిందిగా కోరాడట జూనియర్. స్క్రిప్టుపై మరోసారి వర్క్ చేయాల్సిందిగా సూచించాడట. ఏదేమైనా ఆచార్య చిత్రంతో కెరీర్ లో తొలిసారి ఫెయిల్యూర్ అందుకున్నారు కొరటాలను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ఎలాంటి తప్పు చేయకుండా ఉండేందుకే కొరటాలకు మరికొంత సమయం ఇచ్చి స్క్రిప్టుపై పూర్తిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.