Janaki Kalaganaledu April 25 Episode: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో జానకిని చదువుకోమని రామచంద్ర ప్రోత్సహించడంతో జానకి రామ చంద్ర గురించి గొప్పగా పొగుడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి, రామచంద్ర లు బైక్ లో వెళుతూ ఉంటారు. బైక్ వెళ్తూ ఉండగా ఇందులో రామచంద్రకు ఫోన్ రావడంతో ఒక చోట బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ ప్లేస్ లో జానకి తాను ఇది వరకు ప్రశాంతంగా చదువుకున్న ప్లేస్ రావడంతో ఆ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది.
అప్పుడు రామచంద్ర ఇదివరకు నేను ఇలా వెళ్తున్నప్పుడు అమ్మాయి చదువుకుంటూ కనిపించిందని, అమ్మాయిని చూస్తే తనకు చాలా ఆనందంగా అనిపించింది. అందుకే అమ్మాయి కోసం స్వీట్ బాక్స్ కూడా ఇచ్చాను అని అనడంతో, అప్పుడు జానకి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కరెంటు పోయి ఉంటుంది అందుకే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చదువుకుంటుందేమో అని అంటుంది.
అంతమాత్రానికే మీరు స్వీట్ బాక్స్ ఇవ్వాలా, మీ ఉద్దేశం ఏంటి అని రామచంద్ర పై కామెడీ గా అరుస్తుంది. ఆ అమ్మాయి తానే అని తెలుసుకున్న జానకి మనసులో ఆనంద పడుతూ ఉంటుంది. ఆ తరువాత ఆ చదువుకుంటున్న అమ్మాయి తానే అని అర్థం అయ్యే విధంగా ఇండైరెక్ట్ గా రామచంద్రకు చెబుతుంది. ఆ విషయం తెలుసుకున్న రామచంద్ర ఆనందంగా ఉంటాడు.
అప్పుడు జానకి మాట్లాడుతూ నేను చాలా అదృష్టవంతురాలనండి నేను ఎవరో తెలియక ముందు నా చదువుకు మీరు గిఫ్ట్ ఇచ్చారు అనే రామచంద్ర చేతులు పట్టుకుని ఎమోషనల్ అవుతుంది. ఇక రామచంద్ర, జానకి లో ఇంటికి వెళ్తుండగా మధ్యలో లూసి అనే అమ్మాయి జరుగుతుంది. ఆమె పాస్పోర్ట్ కూడా వారికి దొరకడంతో ఎలా అయినా ఆమెను వెతికి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు.
మరుసటి రోజు జ్ఞానం బావ కూతురు జడ వేస్తూ ఉండగా కుటుంబం అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారు. అప్పుడు రామచంద్ర జానకిని అద్దంలో చూస్తూ మురిసిపోతూ ఉండగా అది గమనించిన జ్ఞానాంబ ఎలా అయినా జానకి నుంచి రామచంద్ర ని దూరం చేయాలి అనుకుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Janaki Kalaganaledu: జానకిని ఎలా అయినా చదివించాలి అనుకున్న రామచంద్ర.. జ్ఞానాంబ ఏం చేయనుంది..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World