Guppedantha Manasu Feb 2 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. అందరూ ఇంట్లో కూర్చొని స్వీట్స్ తింటూ ఉంటారు. ఆ సమయంలో రిషి చెయ్యి తగలడంతో వసు స్వీట్ కింద పడుతుంది. వెంటనే రిషి తన స్వీట్ ఇవ్వడంతో దేవయాని కోపంతో రగిలిపోతుంది. గౌతమ్ మాత్రం తాను ఇవ్వలేకపోయాను అని బాధ పడతాడు.
ఆ తర్వాత జగతి మహేంద్రవర్మ ను ఒక రూం లోకి తీసుకెళ్లి.. రిషి ఎంగిలి చేసిన స్వీట్ ను వసు తిన్నది కదా.. అంటే ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉంటేనే ఎంగిలి పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడతారు అని అంటుంది. నిజమే అని మహేంద్ర వర్మ కూడా ఆశ్చర్యపోతాడు. ఎలాగైనా ఈ విషయంలో వాళ్లకు సపోర్ట్ చేస్తూ జాగ్రత్త పడాలి అని అంటుంది.
ఇక దేవయాని.. జగతి, మహేంద్రల గురించి వెతుకుతూ ఉంటుంది. వాళ్లు ఉన్న గది దగ్గరికి వెళ్లి అక్కడ వింటుంది. వెంటనే జగతి దేవయాని వచ్చిన విషయాన్ని గమనించి సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే గౌతమ్ వచ్చి దేవయానిని పిలుస్తాడు. దేవయాని అక్కడినుంచి వెళ్లగా గౌతమ్ కూడా డోర్ తీయడానికి ప్రయత్నిస్తాడు.
Guppedantha Manasu Feb 2 Episode Today : రిషి ఎంగిలి చేసిన స్వీట్ ను వసు తిన్నదా అంటూ..
మళ్లీ వసు గుర్తుకు రావడంతో వసు దగ్గరికి వెళ్తాడు. అందరూ ఇంటి బయట ముగ్గులు వేస్తూ ఉంటారు. వసు ఓ చోట కూర్చుని ఉంటుంది. మహేంద్ర జగతి తో బాగా సందడి చేస్తూ ఉంటాడు. అంతలోనే ధరణి చిన్న అత్తయ్య అని అనడంతో గౌతమ్ షాక్ అవుతాడు. వెంటనే గౌతమ్ అడగటంతో జగతి సరిదిద్ది చెబుతుంది.
రిషి లోపలికి వెళ్లడంతో మహేంద్రవర్మ జగతి తో ఫోటో దిగుతాడు. గౌతమ్ కూడా వసును తెగ ఫోటోలు దింపుతూ ఉంటాడు. ఇక రిషి వసుకు టాబ్లెట్స్ తీసుకుని వస్తాడు. అప్పుడే గౌతమ్ వసు దగ్గరికి వెళ్లి టాబ్లెట్ వేసుకునే టైం అయింది అని అనడంతో రిషి సార్ తీసుకువచ్చాడని అంటుంది. గౌతమ్ తన మనసులో వీడు నాకు పోటీగా ఉన్నాడు ఏంటి అని తట్టుకోలేకపోతాడు.
ఇక అందరూ కాసేపు ముగ్గు చుట్టూ ఆడుతూ ఉంటారు. రిషి వసును చూస్తూ అందంగా ఉన్నావు అని పొగుడుతాడు. మళ్లీ గౌతమ్ అక్కడికి వచ్చి వసు అందాన్ని పొగుడుతాడు. ఇక జగతి రిషికి బట్టలు ఇవ్వమని వసుకు పెద్ద పరీక్ష పెడుతుంది. అది విన్న దేవయాని జగతికి ఎదురుదెబ్బ తగిలేలా ప్లాన్ చేస్తుంది.
Read Also : Guppedantha Manasu : వసు అందాన్ని పొగిడిన రిషి.. తల్లీ, కొడుకులను దూరం చేయడానికి మరో ప్లాన్ చేసిన దేవయాని!
Tufan9 Telugu News And Updates Breaking News All over World