...

Jabardasth: జబర్దస్త్ కమెడియన్ గీతూ రెమ్యునరేషన్ అంత ఉంటుందా..?

Jabardasth: తెలుగు టీవీ ఛానళ్లలో నవ్వించే ప్రోగ్రాం ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ మాత్రమే. జబర్దస్త్ కు పోటీగా చాలా ప్రోగ్రామ్స్ ను మిగతా ఛానల్స్ తీసుకువచ్చినా ఏ ఒక్కటి కూడా జబర్దస్త్ బీట్ చేయలేకపోయాయి. వచ్చిన దారిలోనే వెనక్కి పోయాయి. జబర్దస్త్ లో బూతు ఎక్కువగా ఉంటుందని అందరూ అంటారు. కానీ ఎక్కువగా అదే ప్రోగ్రాం ను చూస్తారు. అయితే ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కంటెస్టెంట్ అస్సలే కనిపించే వారు కాదు. మగవారే లేడీ గెటప్ లు వేసే వారు.

యాంకర్ సీట్లో అనసూయ, రష్మి, జడ్జీ సీట్లో రోజా తప్ప పెద్దగా ఆడ వాసన వచ్చేది కాదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. జబర్దస్త్ లో చాలా మంది లేడీస్ కనిపిస్తున్నారు. చాలా మంది లేడీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరి రాకతో జబర్దస్త్ మంచి కలర్ ఫుల్ గా మారిందనే చెప్పాలి. అనసూయ, రష్మీ హాట్ హాట్ గా కనిపించే వారు. ఇప్పుడు వారికి తోడుగా వీళ్లు జత కలిశారు.

ప్రస్తుతం జబర్దస్త్ షోలో వీరి డామినేషన్ ఎక్కువై పోయింది. ఫాయిమాకు ఎక్కడ లేని క్రేజ్ ఉందని అనడం ఏమాత్రం ఆశ్చర్యంగా అనిపించదు. గీతూ కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. గీతూ విషయానికి వస్తే రాయలసీమ యాసతో టిక్ టాక్ ద్వారా ఒక వెలుగు వెలిగిన ఈ అమ్మాయి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

గీతూకు పెళ్లి కూడా అయిపోయింది. అయినా ఏమాత్రం తగ్గకుండా యాక్టివ్ గా ఉంటుంది. జబర్దస్త్ లో కొన్ని రోజులుగా చేస్తూ వస్తున్న గీతూ ఈ మధ్య రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిందట. ఒక్క కాల్ షీట్ కు రూ. 50 నుండి 75 వేలు వసూలు చేస్తోందట.