Lucky gifts : మనం జీవితంలో ఏదో ఒక సమయంలో బహుమతి తీసుకోవడం, ఇవ్వడం వంటివి జరుగుతుంది. ఈ మధ్య చాలా మంది బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. పెళ్లిళ్లు, పుట్టిన రోజు, వార్షికోత్సవాలు, లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఉమెన్స్ డే… ఇలా వారికి నచ్చిన ముఖ్యమైన రోజుల్లో గిఫ్టులు ఇస్తుంటారు. అయితే మనకు నచ్చినవి ఏవేవో ఉస్తుంటాం. కానీ ఈ ఐదు బహుమతులు ఇచ్చినా, తీసుకున్నా చాలా అదృష్టం అంట. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అందులో మొదటి గనేషుడి విగ్రహం లేదా ఫొటో. దీన్ని ఇచ్చినా, పుచ్చుకున్నా అదృష్టం కలసి వస్తుందట. దీని వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. గణేషుని అనుగ్రహంతో జీవితంలోని కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే వెండి.. స్వచ్ఛమైన లోహాల్లో వెండి ఒకటి. ఇతరులకు వెండితో చేసిన వస్తువులను ఇ్వడం లేదా స్వీకరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. దాంతో ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదట.
లక్ష్మీ దేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందట. అలాగే ఏనుగు.. హిందూ సంప్రదాయాల ప్రకారం ఏనుగుకు చాలా విశిష్టత ఉంది. ఏనుగు విగ్రహాన్ని ఇవ్వడం లేదా తీసుకోవడం వల్ల లక్కు కలిసి వస్తుందట. ఏడు గుర్రాలు పరిగెడుతున్నట్లుగా ఉండే పెయింటింగ్ ను బహుమతిగా ఇచ్చినా లేదా తీసుకున్నా చాలా లాభం చేకూరుతుందట. దుస్తులు కూడా ఇచ్చినా తీసుకున్నా ఇరువురికి మంచి జరుగుతుందట. అయితే నలుపు రంగు వాటిని మాత్రం అస్సలే బహుమతులుగా ఇవ్వకూడదు.
Read Also : Astrology tips : చేపట్టిన ప్రతి పనీ ఆగిపోతుందా.. అయితే ఇలా చేయండి!