Guppedantha Manasu April 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాజీవ్ రోడ్డుపై వసు కీ కనిపించి, కొన్ని మంచి మాటలు చెప్పి వసుధార ని బుట్టలో వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి కార్లో వెళ్తూ వసు గురించి ఎందుకు నేను ఇంతలా ఆలోచిస్తున్నాను, నాకు ఏమయింది.. ఎందుకు నన్ను వసు ఇంతలా డిస్టర్బ్ చేస్తోంది అని తనలో తానే మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటాడు. మరొక వైపు వసు తన రూమ్ కీ చూడగా అక్కడ రాజీవ్ పడుకుని ఉంటాడు.
రాజీవ్ ని తన రూమ్ లో చూసిన వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు రాజీవ్ మంచి వాడిలా నటిస్తూ వసు తాగడానికి నీళ్ళు ఇస్తాడు. ఇంతలో రిషి,వసుకి ఫోన్ చేయడంతో అప్పుడు రాజీవ్ కొంచెం తప్పుగా మాట్లాడడం తో వసు సీరియస్ అయి అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని గట్టిగా అరుస్తుంది.
ఆ తర్వాత బస్సు ఫోన్ స్విచాఫ్ వస్తుంది డటంతో రిషి, వసు పనిచేసే రెస్టారెంట్ కి వెళ్లి ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు అని అడుగుతూ ఉండగా ఇంతలో రాజీవ్ హలో వెయిటర్ నా ఆర్డర్ కూడా తీసుకో అని అనడంతో, రాజీవ్ ని చూసి చూసి ఒక్క సారిగా కోపంతో రగిలిపోతాడు. అప్పుడు రాజీవ్, రిషి ని బాగున్నావా అని వెటకారంగా మాట్లాడుతాడు.
అంతేకాకుండా ఏమి వసు ఎప్పుడు మీ రిషి, సార్ సేవలోనే తరిస్తావా,అప్పుడప్పుడు నాకు కూడా సేవలు చెయ్, నువ్వు మీ రిషి సార్ ప్రాపర్టీ కాదు కదా అని అనడంతో ఆ మాటకు రిషి ఒక్కసారిగా రాజీవ్ పై కోపంతో విరుచుకు పడతాడు.
ఇంతలో మేనేజర్ అక్కడికి రావడంతో రాజీవ్ కొంచెం సెంటిమెంట్ గా మాట్లాడి వసు ఏడిపించి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత రిషి, రాజీవ్ కారు ని ఫాలో అవుతూ వెళ్తాడు. అనంతరం వసు కి ఫోన్ చేసి వాడు వెళ్లిపోయాడు నీకేం భయంలేదు జాగ్రత్తగా పడుకో అని అనడంతో, అప్పుడు వసు నేను అంటే మీకు ఎంత శ్రద్ధ రిషి సార్ అనే ఆనందపడుతుంది.
ఆ తర్వాత వసు పడుకుని ఉండగా ఇంతలో రాజీవ్ వచ్చి అక్కడికి వసు ని భయపడతాడు. అప్పుడు భయంతో వసు, రిషి కీ కాల్ చేసిన కూడా రిషి కాల్ లిప్ చేయడు. అప్పుడు రాజీవ్ తలుపులు బద్దలు పట్టుకుని లోపలికి వస్తాడు.
రేపటి ఎపిసోడ్ లో భాగంగా వసు మీరు ఈ రోజు సమయానికి రాకపోయి ఉంటే నా జీవితం ఏమై ఉండేది సార్ అంటూ ఎమోషనల్ అవుతూ ఉండగా, ఈ ప్రశ్నలన్నింటికీ నేనే సమాధానం వసు అని అంటాడు. వసు, రిషి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రాజీవ్ అక్కడికి వచ్చి రిషిని కొడతాడు అప్పుడు రిషి కీ రక్తం వస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also :Guppedantha Manasu April 25 Today Episode : వసుపై పగబట్టిన దేవయాని.. రాజీవ్ పై సీరియస్ అయిన రిషి..?