Naga babu : మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా ద్వారా చేసే కామెంట్లు, వేసే పంచులు, సెటైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. ఈ మధ్య నెట్టింట్లో ఎక్కువగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టడం, అందులో నెటిజెన్లు అడిగే ప్రశ్నలకు తన స్టైల్లో మీమ్స్, ట్రోల్స్ తో కౌంటర్లు ఇస్తుంటారు. అయితే తాజాగా నాగబాబు ఇన్ స్టాగ్రాంలో చిట్ చాట్ టేశాడు. నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు అదిరిపోయే రిప్లైలు ఇచ్చాడు. ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి. ఆ తర్వాత ఓ అభిమాని… ఆర్ఆర్ఆర్ లేదా కేజీఎఫ్ అంటూ ప్రశ్న అడగ్గా.. నాగబాబు వెరైటీగా సమాధానం ఇచ్చారు.
ఈ రెండూ కాదు.. ఈ మధ్యే ఒక లెజెండరీ గ్రాఫిక్ సినిమా వచ్చిందంటూ చెప్పాడు. అయితే అందరూ నాగబాబు సన్ ఆఫ్ ఇండియా సినిమా గురించే చెప్పారని అనుకుంటున్నారు. మొత్తానికి మంచు ఫ్యామిలీ వర్సెస్ నాగబాబు వ్యవహారం మాత్రం ఇంకా వేడి మీదే ఉందనిపిస్తోంది. అందరూ ఇలాగే భావిస్తున్నప్పటికీ… నాగబాబు మాట్లాడింది సన్ ఆఫ్ ఇండియా గురించేనా కాదా అన్నది మాత్రం క్లారిటీగా చెప్పలేదు.