Horoscope Today Jan 16 : మేషరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంది.అలసట, పెద్దల నుంచి సహాయ నిరాకరణ. బంధువుల రాకతో ఇబ్బందులు. మహిళలకు శుభంగా ఉంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
వృషభరాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో అనుకోని శుభవార్తలు వింటారు. గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సజావుగా సాగుతాయి. ప్రయాణాలు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మహిళలకు పలుకుబడి పెరుగుతుంది. శ్రీసూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. పిల్లల వల్ల శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు. మహిళలకు మంచి ఫలితాలు. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
కర్కాటక ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటుంది. అనుకోని లాభాలు. కుటుంబంలో శుభ కార్య యోచన చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో లాభాలు. విద్యార్థులకు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మహిళలకు స్వర్ణ లాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
సింహరాశి ఫలాలు : ఈరోజు కొత్త అవకాశాలు. విజయం, సంతోషకరమైన రోజు. స్వర్ణ ఆభరణాలు కొంటారు. బంధువుల కలయికతో ఆనందం. కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట్లో సందడి వాతావరణం. శ్రీరామ తారకాన్ని జపించండి.
కన్యరాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక మందగమనం. మహిళలకు తీవ్ర మనస్తాపం. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకోని చోట నుంచి శుభ వార్తలు వింటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ధనప్రవాహంతో సంతోషం. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలకు హాజరు అవుతారు.మహిలకు నూతనోత్సాహం. కాలభైరావష్టకం పారాయణం చేయండి.
ధనస్సురాశి ఫలాలు : నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పురోగతి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మహిళలకు శుభ దినం. ఇష్టదేవతరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. విందులకు హాజరవుతారు. మహిళలకు నిరాశజనకంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది,అంతే ఖర్చులు కూడా పెరుగుతాయి. అనుకోని అతిథుల రాకతో సందడి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. అనారోగ్యం సూచన. మహిళలకు అనుకోని ప్రయాణాలు. సూర్యనారాయణ ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : అనుకోని లాభాలు,శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు. ఉద్యోగులకు కోరుకున్న స్థానచలనం. మహిళలకు వస్త్రలాభం. ఇష్టదేవతరాధన చేయండి.
Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…