Actor Sachin Joshi : నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ చర్యలు తీసుకున్నారు. సచిన్ జోషి ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనే కారణంతో మొత్తం రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల మేరకు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్‌కి చెందిన వైకింగ్ గ్రూపు కంపెనీలవి ఉన్నాయి. ఎస్ఆర్ఏ ప్రాజెక్ట్‌లో అక్రమాలు జరిగాయనే దానిపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగానే సచిన్ జోషి ఆస్తులను జప్తు చేశారు.
సచిన్ జోషి తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేశారు. మౌనమేలనోయి సినిమాతో ఈయన తెలుగులోనే హీరోగా తన కెరీర్‌ను స్టార్ట్ చేశారు. తర్వాత నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, నీ జతగా నేనుండాలి, వీడెవడు వంటి చిత్రాల్లో నటించారు. హీరోగానే కాదు.. నిర్మాతగానూ ఆయన సినిమాలను రూపొందించారు. ఆయన సినిమాలతో పాటు తమన్నా నటించిన నెక్ట్స్ ఏంటి? వంటి సినిమాను కూడా సచిన్ నిర్మించారు. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందించిన వీరప్పన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ విజయ్ కుమార్ పాత్రలో నటించారు సచినో జోషి. అలాగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లోనూ టాలీవుడ్ తరపున ఓపెనర్ ప్లేయర్‌గా సచిన్ జోషి ఆకట్టుకుంటున్నారు.
తెలుగు నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్‌తో సచిన్ జోషికి ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలున్నాయి. ఒకానొక దశలో తనను బండ్ల గణేష్ మోసం చేశాడని సచిన్ ఆరోపణలు చేశారు. బండ్ల గణేష్ తోడేలు లాంటి వ్యక్తి అని, తనపై 14 కేసులు పెడితే బండ్ల గణేష్ తండ్రి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే వదిలేశానని, బండ్ల గణేష్ నుంచి తనకు రూ.27 కోట్లు రావాల్సి ఉందని వీడెవడు సినిమా ప్రమోషన్స్ సమయంలో సచిన్ జోషి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Read Also : మన భారతీయ నదుల గురించి ఆస్తకిరమైన వాస్తవాలు ఇవే..!