Karthika Deepam March 16th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చూస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..కోపంతో రగిలి పోతున్న సౌర్య,హిమ ఫోటో ని బయటకు విసిరి కొడుతుంది. ఇక అదే సమయంలో ఆనందంతో ఇంటికి వస్తున్న హిమ తన ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఫోటోను చూసి హిమ ఏడుస్తూ ఉంటుంది. సౌర్య అమ్మ నాన్న లేని మింగేసిన ఆ రాక్షసి ఫోటో ఇంట్లో ఉండకూడదని, అప్పుడు ఆనందరావు సౌర్య ఏంటమ్మా ఇది అని అడగగా చెప్పాను కదా తాతయ్య దాని గుర్తులు ఇంట్లో ఏది ఉండకూడదు అని కోప్పడుతుంది.
సౌందర్య, ఆదిత్య లు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా సౌర్య మాత్రం హిమ ను ద్వేషిస్తూ ఉంటుంది. సౌర్య కోపంతో అంటున్న మాటలు హిమ వింటుంది. అసలు హిమకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని సౌర్య అనగా అక్కడి నుంచి హిమ ఏడ్చుకుంటూ వంటరిగా బయలుదేరుతుంది. హిమ ఒంటరిగా ఏడ్చుకుంటూ వెళుతూ సౌర్య తో గడిపిన క్షణాలు అని గుర్తు తెచ్చుకుంటుంది. అలా హిమ బస్తీలోని మోనిత ఇంటికి వెళుతుంది. అక్కడ కార్తిక్, మోనిత కలిసి పూజలో దిగిన ఫోటోని చూసి షాక్ అవుతుంది. ఇక ఆ ఫోటోలు చూసిన హిమ కు ఏమీ అర్థం కాక బయటకు వెళుతుంది.
ఇక ఇంద్రుడు, చంద్రమ్మ లను పోలీసులు ఎవరు మీరు అని అడగగా వీళ్ళు మా పిన్ని బాబాయి సార్ అని చెబుతుంది. మరొకవైపు సౌందర్య నాకు పెద్ద కూడలి ధైర్యం అండి అలాంటిది పెద్ద కోడలు లేకపోతే నన్ను ఎలా బతుకమంటారు అంటూ భోరున ఏడుస్తూ ఉంటుంది. ఈ జన్మలో ఏ పాపం చేసామో శాపం తగిలింది అంటూ ఆనందరావు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఇంటి ఆడపడుచు కన్నీళ్లు ఇంటికి మంచిది కాదు అని అంటారు. మన కూతురు స్వప్న నా మీద దుమ్మెత్తిపోసింది అంటూ ఏడుస్తూ ఉంటుంది.అలాగే సమాజంలో గొప్ప డాక్టర్ గా తెచ్చుకున్న కార్తీక్ జీవితంలోకి మోనిత ఎప్పుడూ అయితే ఎంటర్ అయిందో అప్పటినుంచి కార్తీక్ సుఖం లేకుండా పోయింది అంటూ సౌందర్యం మరింత బాధ పడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..
Read Also : Karthika Deepam: కొడుకును కాదనుకొని వెళ్లిపోయిన మోనిత.. గుండెలవిసేలా రోదిస్తున్న సౌందర్య..?