Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చూస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
సౌందర్య కార్తీక్, దీప లను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆనందరావు నువ్వు ఇలాగే ఉంటే పిల్లలు కూడా బెంగ పడిపోతారు అని అనగా అప్పుడు అవును మీరు చెప్పింది నిజమే అంటూ ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటుంది.
మరొకవైపు ఇంద్రమ్మ దంపతులు హిమ ను మీ ఇల్లు అక్కడే అన్నావు కదా మరి ఎందుకు వచ్చావు అని అడగగా అక్కడ మా వాళ్ళు లేరు అని చెబుతుంది హిమ. నేను వెళ్లిన ప్రదేశాలలో ఎక్కడా మా వాళ్లు లేరు అని చెబుతుంది హిమ. ఇక హిమ ఆకలి అని తినడానికి వెళదామా అని చంద్రమ్మ తో అనగా వాళ్ళు హిమ ను ఒక చిన్న హోటల్ కి తీసుకొని వెళ్తారు.
అక్కడ హిమ తినడానికి సందేహ పడగా అప్పుడు ఇంద్రుడు పెద్ద రెస్టారెంట్ కి తీసుకొని వెళ్తారు. మరొకవైపు సౌందర్య కూతురు స్వప్న ఇంటికి వెళుతుంది. అక్కడ సౌందర్యని స్వప్న నానా మాటలు అంటుంది. కార్తీక్, దీప లు చనిపోయారు అన్న మాటని అడ్డుపెట్టుకొని సంబంధాలు కలుపుకొని పోదామని వచ్చావా అంటూ సౌందర్యాన్ని అవమానిస్తుంది.
అలా కాదు స్వప్న నువ్వు అల్లుడు గారు కలిసి పోవడమే నాకు కావాలి అందుకే అల్లుడి గారిని కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను అని అంటుంది. అప్పుడు స్వప్న సౌందర్య పై మరింత విరుచుకు పడుతుంది. మరొకవైపు పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళిన ఇంద్రమ్మ దంపతులు హిమ అక్కడ హై లెవెల్ లో హడావిడి చేస్తూ ఉంటారు.
మరొకవైపు సౌర్య తల్లిదండ్రులను తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి తనను పిలుస్తున్నట్టు గా ఊహించుకుని బాధపడుతుంది. ఇదంతా కల అనుకుని సౌర్య మరింత కుమిలిపోతూ ఉంటుంది.నాన్న, అమ్మ చావులకు కారణం హిమనె అంటూ హిమ ఫై పడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.