...

Karthika Deepam: ఆనంద్ చుట్టూ హిమా.. మందలించిన వంటలక్క, సౌందర్య?

Karthika Deepam March 1 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటున్న మనందరికీ తెలిసిందే. టిఆర్పి రేటింగ్ దూసుకుపోతున్న సీరియల్ రోజు రోజుకీ ట్విస్ట్ లతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఇక పోతే ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

హిమ,సౌర్య ఆనంద్ తో ఆడుకుంటుండగా దీప వారిని చూసి బాధపడుతుంది. మరొకవైపు మోనిత కార్తీక్ కు కాల్ చేసి నా బాబు సంగతి ఏంటి వెతుకుతున్నావా లేదా అని అడుగడంతో, అప్పుడు కార్తీక్ వెతుకుతున్నాను పదేపదే కాల్ చేసి విసిగించకు అంటూ మోనిత ఫై తీసుకుపడతాడు. అప్పుడు మోనిత బాబు కు సంబంధించిన ఆధారాలు నాతో ఉన్నాయి అని అనగా నేను వచ్చి తీసుకుంటాను అని కార్తీక్ అంటాడు.

కార్తీక్ తన ఇంటికి వస్తున్నాడు అన్న ఆనందంలో మోనిత గంతులు వేస్తూ ఉండగా కాలు బెనుకుతుంది. మరొకవైపు హిమ ఎప్పుడు ఆనంద్ గురించి మాట్లాడుతూ ఉండటంతో సౌందర్య కోప్పడుతుంది. అప్పుడు హిమ తన నానమ్మను తప్పేంటి అనే సృష్టించడమే కాకుండా నువ్వు చాలా మారిపోయావు నానమ్మ అని అంటుంది. అది విన్న దీప హిమ ని గట్టిగా మందలిస్తుంది. ఇంకా మోనిత కార్తీక్ వస్తున్నాడు అని తన ఇంటిని అంతా పూలతో అలంకరించింది.

ఇక బాబుకు సంబంధించిన ఆధారం హాస్పిటల్లో ఉంది అని చెప్పి కార్తీక్ ని తీసుకొని హాస్పిటల్ కి వెళుతుంది మోనిత. ఆ ఆధారాలలో శ్రీవల్లీ,కోటేశ్వర్ ల పేర్లు తీసేస్తుంది. మరోవైపు సౌందర్య బాబును దత్తత ఇవ్వడానికి కార్యక్రమాలు చేస్తుండగా అక్కడికి వచ్చిన మోనిత, బాబు ని ఎందుకు దత్తత ఇస్తున్నారు అని ప్రశ్నిస్తుంది.

అప్పుడు సౌందర్య నువ్వు ఎవరివే అడగడానికి అని అడగగా.. ఆ బాబు కన్నతల్లిని అంటూ మోనిత బాంబు పేల్చింది. ఇది విన్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ కు గురవుతాడు మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Guppedantha Manasu: దేవయాని ప్లాన్ బెడిసికొట్టేలా చేసిన మహేంద్ర..షాక్ లో రిషి.?