...

High Temperature : భానుడి భగభగ… బయటకొస్తే మాడిపోవాల్సిందే!

High Temperature : తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గమంటున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 43.2 డిగ్రీలు దాటుతుండటంతో జనం ఇండ్ల నుంచి బయటకొచ్చేందుకు జంకుతున్నారు. వేడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. మార్చి నెలలోనే మే లో ఉన్నంత ఎండలు ఉంటున్నాయి. శుక్ర, శని వారాల్లో కూడా ఎండలు విపరీతంగా కాశాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. అయితే ఆది, సోమ వారాల్లో కూడా వేడి గాలులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రాకూడదని… ఒక వేళ వచ్చినా గొడుగు, నీళ్ల సీసా తప్పనిసరని సూచించారు. కాగా.. శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనద్, ఆదిలాబాద్ పట్టణంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా మవల, భీంపూర్, బీలలో 42.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. సంగారెడ్డి జిల్లా కల్హేర్ లో 41.2 డిగ్రీలు, మహబూబ్ నగర్, వనపర్తిల్లో 40.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read Also : Hyderabad Metro : మరింత వేగంతో పరుగులు పెట్టబోతున్న హైదరాబాద్ మెట్రో రైళ్లు..!