Anupama parameswaran : సెలబ్రిటీలు బయటకు వచ్చేటప్పుడు ముఖ్యంగా ఏవైనా కార్యక్రమాలకు వచ్చేటప్పుడు.. చాలా జాగ్రత్తగా ఉంటారు. వెంట బాడీ గార్డులను కూడా తెచ్చుకుంటారు. లేదంటే వారు సెలబ్రిటీల మీదకు వచ్చేసి అనుచితంగా ప్రవర్తించే అకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది చాలా సందర్బాల్లో నిరూపితమైంది. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇటీవలే సూర్యాపేటకు వచ్చిన అనుపమ పరమేశ్వరన్ కు చేదు అనుభవం ఎదురైంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Anupama parameswaran
సూర్యాపేటలో ఓ షాప్ ఓపెనింగ్ వేడుకకు అనుపమ హాజరయ్యారు. దీంతో అనుపమను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆమె అందమైన చిరునవ్వుతో పలకిరించారు. చాలా మంది ఆమె తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ క్రమంలోనే ఆమెను ఇంకాసే ఉండాలంటూ కోరారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుండటంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధం అయ్యారు. అయితే కొందరు ఆకతాయిలు ఆమె కారు టైర్లలో గాలి తీసేశారు. దీంతో ఆమె అభిమానులపై అసహనం వ్యక్తం చేసారు. వెంటనే షాప్ సిబ్బంది తమ కారు ఇచ్చి ఆమెను హైదరాబాద్ పంపించి వేశారు.