Prabhas special treat : రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్తగా చేస్తున్న సినిమా సలార్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. అయితే తనతో పాటు షూటింగ్ లో పాల్గొనే వారికి లేదా తనకు బాగా నచ్చిన వారికి హీరో ప్రభాస్ తన ఇంటి వంటకాలను రుచి చూపించడం గురించి మనందరికీ తెలిసిందే. అయితే సలార్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న హీరోయిన్ శృతి హాసన్ కోసం ప్రభాస్ తన ఇంటి నుంచి బాహుబలి మీల్స్ పంపించారు. అది చూసిన శృతి ఆనందంతో పాటు ఆశ్చర్యపోయిందట.
అంతే కాదండోయ్ అందులో ఉన్న దాదాపు 20 కి పైగా రకాల వంటకాలను ఆవురావురుమంటూ ఇష్టంగా తిందట. ఇంత టేస్టీ ఫుడ్ నా కోసం పంపినందుకు థాంక్యూ డార్లింగ్ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ప్రభాస్ అంటే మామూలుగా ఉండదు మరి అంటు కామెంట్లు చేస్తున్నారు.అలాగే ఆ వీడియోలో ఉన్న వంటకాలను చూస్తే మాక్కూడా నోరూరుతుందని చెబుతున్నారు.
Read Also : Nayanathara vignesh wedding : నయన్-విఘ్నేష్‌ల పెళ్లి ఆహ్వానం.. వెడ్డింగ్ కార్డు వీడియో వైరల్..!