Devotional: జీవులు అన్నింటిలోకెల్లా ఆవుకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తోంది హిందూ సనాతన ధర్మం. ఆవును అందుకే గోమాతగా సంభోదిస్తారు. గోమాతలో నిలువెల్లా దేవుళ్లు కొలువై ఉంటారని అంటారు పండితులు. ఆవు నుదుటున శివుడు ఉంటే.. వెనక భాగంలో లక్ష్మీ ఉంటుందని విశ్వాసం. సకల దేవతల నిలయంగా గోమాతను భావిస్తారు. సనాతన ధర్మంలో మానవుల సమస్యలకు సంబంధించి గ్రంథాల్లో అనేక నివారణలు ఇచ్చారు. దాన్ని అవలంబించడం ద్వారా చాలా వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
అదే విధంగా, హిందూ మతంలో ఆవుకు తల్లి హోదా ఉంది. విశ్వాసం ప్రకారం, ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. ఆవుకు బెల్లం తినిపించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. గ్రహ రాశి, జీవితంలో జరుగుతున్న సమస్యల నుండి బయట పడేందుకు ఆవుకు బెల్లం లేదా రొట్టెతో కలిపిన బెల్లం తినిపిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయి.
ఆవుకు రొట్టె తినిపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే… పురాణాల ప్రకారం క్రమం తప్పకుండా ఆవుకు రొట్టెలో బెల్లం కలిపి తినిపించే వ్యక్తి ప్రతి రంగంలో అభివృద్ధి చెందుతాడు. వారు నిరంతరం పురోగతిని పొందుతాడు. మీరు కూడా పురోగతిని పొందాలనుకుంటే ఆవుకు క్రమం తప్పకుండా బెల్లంతో రోటీని తినిపించండి.
ఆవుకు ప్రతి రోజూ బెల్లం, రోటీని తినిపించే వ్యక్తి అతీంద్రియీ శక్తి సహాయం పొందుతాడు. అతని చెడు పనులన్నీ బాగు పడతాయి. విశ్వాసం ప్రకారం ప్రతి రోజూ ఆవుకు బెల్లం కలిపి రోటీని తినిపించడం వల్ల చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఎటు వంటి ఆటంం లేకుండా పూర్తి అవుతాయి. సంతాన సంతోషాన్ని కోరుకునే వారు ప్రతి రోజూ ఉదయం ఆవుకు బెల్లం తినిపించాలి.