...

Hero Yash: హీరో యష్ గారాలపట్టి ఎంత క్యూట్ గా పాట పాడిందో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో?

Hero Yash: కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కన్నడ స్టార్ హీరో యశ్. తాజాగా ఆయన నటించిన కేజిఎఫ్ చాప్టర్ 2 వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కేజిఎఫ్ పేరు మార్మోగిపోతోంది.ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన నటి రాధికా పండిట్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే వీరికి ఒక కూతురు ఒక కొడుకు సంతానం కలరు.

తాజాగా యశ్ కుమార్తె ఐరా.. ‘సలాం రాకీ భాయ్‌.. రారా రాఖీ..’ అంటూ ఎంతో క్యూట్‌గా పాట పాడింది. ఇక ఈ పాటకు సంబంధించిన వీడియోను యశ్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోని షేర్ చేస్తూ . ‘నా రోజును ఐరాతో ప్రారంభించాను’ అనే క్యాప్షన్‌ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియో చూసిన యశ్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ క్రమంలోనే ఈ వీడియో పై స్పందిస్తూ . ‘సో క్యూట్‌’, ‘బ్యూటిఫుల్‌ వీడియో’ అంటూ లవ్‌, హార్ట్‌ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

సీరియల్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన యశ్ అనంతరం సినిమా అవకాశాలను అందుకొని హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నటి రాధిక పండిత్ తో కలసి ఈయన పలు సినిమాలలో నటించి అనంతరం 2016వ సంవత్సరంలో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ దంపతులు 2018లో ఐరాకు జన్మనివ్వగా ఆ తర్వాత 2019 అక్టోబర్‌లో అధర్వ్‌ పుట్టాడు.