50 Paise coin : 50 పైసల నాణెం విలువ ఎంత ఉంటుంది. అదే ప్రశ్న.. 50 పైసల నాణెం విలువ అర్ధ రూపాయే ఉంటుంది అంటారా.. అవును అంతే ఉంటుంది. కానీ అది ఒకప్పుడు.. ఎప్పుడంటే 50 పైసల నాణెం చెల్లుబాటు అయ్యే సమయంలో. కానీ ఇప్పుడు వాటిని ఎవరూ యాక్సెప్ట్ చేయడం లేదు. అవి పూర్తిగా కనుమరుగయ్యాయి.
నాణెలు, నోట్లు సేకరించే అలవాటు ఉన్న వారి వద్ద ఆ నాణెలు ఉండే అవకాశం ఉంది. అయితే.. ఇప్పుడు 50 పైసల నాణెం ఉంటే వాటితో మీరు లక్షల రూపాయలను సంపాదించవచ్చు. ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లలో పాత నాణెలు, నోట్లు వేలం వేస్తున్నారు. ఆ వేలంలో మీ దగ్గరున్న నాణెలను అమ్మేయవచ్చు. నిజానికి ఈ రోజుల్లో ద్రవ్యోల్బణం యుగంలో. 50 పైసల నాణెం ట్రెండ్ మాత్రమే ఉంది. వాస్తవానికి ఇది మార్కెట్ లో చెల్లుబాటు కాకుండా పోయింది. అయితే ఆన్ లైన్ వేలాల్లో మాత్రం వీటికి భారీ విలువ లభిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న వేలం.. 2011 సంవత్సరంలో తయారైన 50 పైసల నాణెంపై. పలు బిజినెస్ సైట్ లలో 50 పైసల స్టీల్ కాయిన్ ను లక్ష రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ మెరిసే నాణెంలో ఒక ప్రత్యేకత ఉందని, అందుకే అంత ధర పలుకుతోందని చెబుతున్నారు నిపుణులు.