Janaki Kalaganaledu March 23th Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు సీరియల్ ఒకటి. కుటుంబ కథాంశంతో ప్రసారమయ్యే ఈ సీరియల్ కు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి. రోజురోజుకు ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి రేటింగ్ సంపాదించుకుంటోంది. ఇకపోతే ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… దిలీప్ వెన్నెల నిశ్చితార్థం ఆగిపోవడంతో జానకి రామ పై జ్ఞానంబ ఎంతో కోపంతో ఉంటుంది.ఈ క్రమంలోనే దిలీప్ తల్లిదండ్రులు జ్ఞానంబ ఇంటికి వచ్చి తనతో గొడవ పెట్టుకుంటారు.
పెళ్లి చూపులకు వచ్చిన రోజే ఈ విషయం మీ దగ్గర చెప్పాలని మేము అనుకున్నాము కానీ ఈ విషయం మీకు చెప్పకుండా మీ కొడుకు కోడలు మమ్మల్ని అడ్డుకున్నారని దిలీప్ తల్లిదండ్రులు జ్ఞానంబను నిలదీయడంతో వారి మాటలకు జ్ఞానంబ మరింత బాధ పడుతుంది.ఇక ఇలా జ్ఞానాంబ కుటుంబం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన దిలీప్ కుటుంబం వీరి వ్యవహారం చూస్తుంటే ఆ రోజు దిలీప్ వెన్నెల కొండపై నుంచి దూకడం కూడా కట్టు కథలే అని అనుమానం వస్తుందని చెబుతారు. ఇదంతా కూడా కేవలం వీరి పెళ్ళి జరగడం కోసమే నాటకం ఆడారని తెలుస్తోంది.

ఇక రామ జానకి గురించి కూడా దిలీప్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అసలు ఏం కొడుకును కన్నారు. ఇలా భార్య మాటలు విని తల్లిని మోసం చేయడానికి మీకు సిగ్గుగా లేదా అంటూ రామాను కూడా తిడతారు. అప్పటికి జానకిరామ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసిన దిలీప్ కుటుంబ సభ్యులు వారిని తిడుతూ జ్ఞానంబ పెంపకంపై కూడా అసహనం వ్యక్తం చేస్తారు.ఇలా మా కుటుంబ పరువును రోడ్డుకు ఈచ్చినందుకు మీ కుటుంబం మొత్తాన్ని పోలీస్ స్టేషన్ కి లాగుదామని దిలీప్ తల్లిదండ్రులు జ్ఞానంబను తిట్టడంతో జ్ఞానంబ మరింత బాధపడుతుంది.
ఈ విధంగా దిలీప్ కుటుంబ సభ్యులు తనని తిట్టే వెళ్లడంతో జ్ఞానంబ ఈరోజు నుంచి నాకు పెద్ద కొడుకు కోడలు లేరని నేను అనుకుంటున్నా తక్షణమే వాళ్ళు ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెబుతుంది. దీంతో వెన్నెల వచ్చి తన తల్లికి నచ్చచెప్పే ప్రయత్నం చేయగా జ్ఞానంబ తన పై చేయి చేసుకుంటుంది, ఇక రామ, జానకి కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు వెళ్ళగా ఇంటిలో ప్రతి ఒక్కరు ఎంతో బాధ పడతారు. కానీ మల్లిక మాత్రం లోలోపల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తికాగా తరువాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.
Read Also : Janaki kalaganaledu: జానకి రామచంద్రలను మైరావతి పొగడడం వెనుక ఆంతర్యం ఏమిటి ? జ్ఞానంబ ఏం చేయబోతుంది ?