Devatha Today Episode Feb 18 : ఒకే భర్తను పెళ్లాడిన ఇద్దరు అక్కాచెల్లల మధ్య ప్రేమ, పరిస్థితులు ఎలా ఉన్నాయన్న నేపథ్యంలో మా టీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్ “దేవత”. మరి ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం.
పిల్లలు పుట్టాలని ఆదిత్య వాడుతున్న టాబ్లెట్స్ పెరటిలో పడి ఉండడం ఏంటని ఆదిత్యని నిలదీయాలని సత్య, దేవుడమ్మ, దేవుడమ్మ భర్త ఆగ్రహంతో ఉంటారు. అంతలో అటుగా ఆదిత్య వస్తాడు. ఆదిత్యను మందులు ఎందుకు వేసుకోవడం లేదు అని అడుగుతారు.. ఎందుకలా మోసం చేస్తున్నావ్ అని అడుగుతుంది దేవుడమ్మ. దానికి నిర్గాంతపోయిన ఆదిత్యను చిన్న సమస్యే మందులు వాడితే పిల్లలు కలుగుతారు అని చెప్పి ఇలా మందులు ఎందుకు పడేశావని ప్రశ్నిస్తూ సత్య బాధపడుతుంది.
నువ్ చేసిన తప్పుకి సత్య ఎన్నాళ్లు గొడ్రాలిగా మాటలుపడుతుంది అని దేవుడమ్మ ఆదిత్యను నిలదీస్తుంది. అటుపోతే టాబ్లెట్స్ వేసుకోవడం లేదని ఎవరు మీకు చెప్పారని ఆదిత్య అడుగుతాడు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావ్ మా కోరిక ఎప్పుడు తీరుతుంది మీకు పిల్లలు ఎప్పుడు పుడతాడు అని దేవుడమ్మ అంటుంది. దానికి ఆదిత్య డాక్టర్ కొత్త మందులు రాసిచ్చాడు ఆ మందులు వాడొద్దని చెప్పాడు అందుకే అవి పాడేశాను కొత్త మందులను కారులోని ఉంచి మర్చిపోకుండా వేసుకుంటున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు.
Devatha Today Episode Feb 18 : ఆదిత్యకు ఊహించని ట్విస్ట్…
సీన్ కట్‌చేస్తే సత్య వెళ్లి కారులో మందులు ఉన్నాయా లేదా అని చెక్‌చేస్తుంది. కానీ కారులో ఎటువంటి మందులు కనిపించవు దానితో ఆదిత్య అబద్ధం చెప్పాడని ఎందుకలా చెప్పాడా అని ఆలోచిస్తుంది. అటుపోతే కమల బాషల ప్రేమను చూసి పటేలు కొంచెం ఉడికిపోతుంటాడు. పటేలుకు అన్నీ రెండురెండుగా మసకగా కనిపిస్తుంటాయి. దానిని గమనించిన బాష పటేలను కాఫీకప్పుతో ఆటపట్టిస్తుంటాడు.
ఇకపోతే దేవుడమ్మ బాషతో కలిసి పార్కులో దేవీ కోసం ఎదురు చూస్తుంటారు. అంతలో దేవి అక్కడకు వస్తుంది దేవిని చూసిన దేవుడమ్మ తెగ మురిసిపోతుంది. నువ్ ఎదురుచూస్తుంటావ్ అని సైకిల్‌ని దేవి చాలా ఫాస్ట్‌గా తొక్కిందని చిన్మయి చెప్తుంది. తెచ్చిన స్వీట్స్‌ని పిల్లలకు తినిపించి దేవుడమ్మ సంతోషిస్తుంది. దేవుడమ్మను దేవి అని ముద్దుగా పిలుస్తుంది. కాసేపు పిల్లలతో దేవుడమ్మ సరదాగా ఆటలు ఆడుతుంది.
రాధ ఆదిత్య చెప్పిన మాటలను ఆలోచిస్తూ బాధపడుతూ గుడికి వెళ్తుంది. అమ్మవారితో తను బాధను చెప్పుకుంటూ ఏడుస్తుంది. నా చెల్లికోసం అన్ని వదిలేసి దూరంగా వచ్చేశాను. ఇప్పుడు పెనిమిటి నా మీద కోపం వచ్చి నన్ను వదిలేసి పోయావని కోపం పడుతుండు అంటూ బాధను వెళ్లగక్కుతంది. ఇంత తర్వాత ఏమవుతుందనేది నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడాలి.
Read Also : Bheemla Nayak Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌కి వేళాయే… ఎప్పుడంటే?