Bigg Boss Non Stop Telugu : మొదటి వారంలో ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరిలో ఒకరు

bigg-boss-non-stop-telugu-who-will-eliminate-from-bigg-boss-telugu-ott-in-1st-week
bigg-boss-non-stop-telugu-who-will-eliminate-from-bigg-boss-telugu-ott-in-1st-week

Bigg Boss Non Stop Telugu : తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ఇటీవలే మొదలైన విషయం తెల్సిందే. మొదటి వారంలోనే ఎలిమినేషన్ కు నామినేషన్స్ జరిగాయి. కొత్త వారు పాత వాళ్ళ కలయిక లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ విభిన్నంగా జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా పాత కంటెస్టెంట్స్ అయినా నటరాజ్‌ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, అఖిల్‌, అరియానా లు నామినేట్ అయ్యారు. వీరిలో నుంచి వీక్‌ కంటెస్టెంట్ గా నట్రాజ్ మాస్టర్ ని అంతా భావిస్తున్నారు.

ఆయనకు ఆన్లైన్లో చాలా తక్కువగా ఓట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన గతం లో చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు కూడా చేస్తున్నాడు అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆయన్ను కొన్ని రోజుల పాటు ఉంచడం జరిగింది… కాని ఈ సారి మాత్రం ఆయన్ని వెంటనే బయటికి పంపే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Bigg Boss Non Stop Telugu : ఈ వారం ఎలిమినేట్ ఈమేనా? 

Bigg Boss Non Stop Telugu : Actress Mitra Sharma Likely To Be Eliminated Here Is Bigg Boss OTT Telugu
Bigg Boss Non Stop Telugu : Actress Mitra Sharma Likely To Be Eliminated Here Is Bigg Boss OTT Telugu

ఇదే సమయంలో కొత్త వారి నుండి ఆర్ జె చైతు మరియు మిత్ర శర్మ నామినేట్ అయ్యారు. వీరిద్దరిలో మిత్ర శర్మ డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆమెకు తక్కువ ఫాలోయింగ్ ఉండడంతో పాటు సోషల్ మీడియాలో పెద్దగా అభిమానులు లేరు. దాంతో నట్రాజ్ మాస్టర్ కి ఎలిమినేట్‌ అవ్వడంలో మిత్ర శర్మ కచ్చితంగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

వీరిద్దరిలో ఏ ఒక్కరూ కచ్చితంగా ఎలిమినేట్‌ అవుతారని ప్రేక్షకులు విశ్వసిస్తున్నారు. అదే జరుగుతుంది అని హాట్ స్టార్ వర్గాల నుండి కూడా సమాచారం వస్తుంది. మరో నాలుగు రోజుల్లో ఏం కాబోతుంది చూడాలి. శనివారం లేదా ఆదివారం ఎపిసోడ్ లో ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Read Also : Ashu Reddy: అషు రెడ్డి మొహంపై ఉమ్మిన యాంకర్ చైతూ.. కారణం అదే!

Advertisement