...

Intinti Gruhalakshmi May 28 Today Episode : అంకిత కోసం మాస్టర్ ప్లాన్ వేసిన భాగ్య,లాస్య..?

Intinti Gruhalakshmi May 28 Today Episode  : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో భాగ్య, లాస్య దగ్గరికి వెళ్ళి లాస్య ని కోటీశ్వరురాలు అంటూ పొగుడుతూ ఉంటుంది.

ఈ రోజు ఎపిసోడ్ లో భాగ్య,లాస్య దగ్గరికి వచ్చి అభి గురించి మాట్లాడుతూ నువ్వు కూడా అభిలాగే కోటీశ్వరురాలు కాబోతున్నావ్ అని అనగా అప్పుడు లాస్య నీకు అలాఅర్థం అయ్యిందా అని అంటుంది. అప్పడు భాగ్య అభిని బాగా మచ్చిక చేసుకో అని చెప్పి లాస్యను రెచ్చగొడుతుంది.

Intinti Gruhalakshmi May 28 Today Episode 
Intinti Gruhalakshmi May 28 Today Episode

అప్పడు లాస్య అభిని ఇంట్లో పెట్టుకోవడం ఈజీ కానీ ఆ అంకిత మాత్రం అంత ఈజీగా పడదు అని అనడంతో లాస్య కు భాగ్య ఒక అద్భుతమైన ప్లాన్ చెబుతుంది. ఆ తరువాత తులసి పార్కుల్లో వాకింగ్ చేస్తూ ఉండగా అక్కడికి లాస్య వెళ్లి తులసిని తన మాటలతో రెచ్చగొడుతుంది.

తులసి ఏమాత్రం తగ్గకుండా లాస్య కు గట్టిగా సమాధానం చెబుతుంది. అప్పుడు లాస్య ఈ విషయంలో తాను చేస్తున్న ప్లాన్ గురించి వివరిస్తుంది. అప్పుడు తులసి నీకు అంత సీన్ లేదు అని అనడంతో చేసి చూపిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది లాస్య. ఇలా అభి,ప్రేమ్, శృతి ఇలా అందర్నీ నీ నుంచి దూరం చేస్తాను అని అంటుంది.

తులసి అప్పుడు ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు ఇంటిదగ్గర పరంధామయ్య కి దివ్య వాకింగ్ చేయమని చెప్పి పనిష్మెంట్ ఇస్తుంది. ఇంతలో తులసి రావడంతో పరంధామయ్య తులసి తన గోడును చెప్పి దివ్య మొండిగా ప్రవర్తిస్తుంది అని అంటాడు. అప్పుడు తులసి దివ్య కు నచ్చ చెప్పి పరందామయ్య ను కాపాడుతుంది.

ఆ తర్వాత తులసి దగ్గర సంగీతం కొందరు పిల్లలు జాయిన్ అవుతారు. మరొకవైపు అభిని మచ్చిక చేసుకోవడం కోసం అభి ఇంటికి వస్తాడు అని తెలిసి లాస్య అభి కోసం వంటలు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే అభి రావడంతో నందు కపట ప్రేమ చూపించి అభి నీ దగ్గర చేసుకోవడానికి చూస్తూ ఉంటాడు.

అప్పుడు అభి తండ్రి మాటలకు పొంగిపోయి మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని మాట ఇస్తాడు. ఇక తర్వాత రోజు అభి పుట్టినరోజు అని తెలిసి లాస్య మనం వేలు ఖర్చు పెట్టి అయినా అభికి పుట్టినరోజు వేడుకలు చేద్దాం అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Intinti Gruhalakshmi MAY 24 Today Episode : అభి పై మండిపడిన అంకిత..ప్రేమ్ గురించి బాధ పడుతున్న తులసి..?