Sunset : లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ చాలా ప్రయత్నిస్తుంటారు. అమ్మవారి అనుగ్రహం కోసం పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. సనాతన ధర్మంలో లక్ష్మీ దేవి కోసం ఎలాంటి పూజలు చేయాలనేది పేర్కొన్నారు. సనాతన ధర్మంలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఆయా పనులు చేస్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
చీకటి పడిన తర్వాత కొన్ని పనులు చేయవద్దని మన ఇంట్లో వాళ్లు చెబుతూనే ఉంటారు. సూర్యాస్తమయం కాగానే ఆ పని చేయవద్దు, ఈ పని చేయవద్దు అని అనడం చాలా సార్లు వినే ఉంటాం. ఆయా పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాయంత్రం పూట నిద్రిస్తే అనేక రోగాల బారిన పడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సాయంత్ర వేళ నిద్రిస్తే వ్యక్తి ఆయుష్షు కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో ఇంటికి లక్ష్మీ దేవి వస్తుందని అంటారు. అందుకే ఈ సమయంలో తలుపులు కూడా మూయవద్దని చెబుతున్నారు పండితులు.
అలాగే సాయంత్రం వేళ ఇంటిని ఊడవకూడదు. సాయంత్రం వేళ ఇంటిని ఊడవడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుందని అంటారు. అలాగే ఊడవడం వల్ల ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుందని చెబుతారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సాయంత్రం వేళ ఇంటి గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవద్దు. శాస్త్రాల్లో ఇంటి గుమ్మం మీద కూర్చోవడం అశుభమని అంటారు. ఇలా గుమ్మంలో కూర్చోవడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లోకి రాదు.
Read Also : Ashoka tree root: ఈ చెట్టు వేరును మీ ఇంట్లో పెట్టుకున్నారంటే… కోటీశ్వరులు అవ్వాల్సిందే!