Astrology Gold : బంగారం… ఈ రోజుల్లో దీన్ని చాలా మంది ఒక ఆభరణంగా కాకుండా… పెట్టుబడిగా భావిస్తున్నారు. అలానే బంగారాన్ని ఇష్టపడని వారు ఉండరు అనుకోండి. బంగారం ధరించడం వల్ల వారికి ఆనందం, శ్రేయస్సు లభిస్తాయట. అందుకే దీనిని విలువైన లోహం అని కూడా పిలుస్తారు. బంగారం ధరించడం ఆరోగ్యానికి మంచిదని శాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం కూడా… బంగారం ధరించడం వల్ల మనిషి ఏకాగ్రత పెరుగుతుంది. బంగారం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే కొందరికి మాత్రం ఇది నష్టాన్ని కూడా కలిగిస్తుందట. దీనికి సంబంధించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో మీకోసం…
పవిత్రమైన రోజు, శుభ సమయంలో బంగారం ధరిస్తే దాని లక్షణాలు చాలా రెట్లు పెరుగుతాయని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం ఆది, బుధ, గురు, శుక్రవారాల్లో బంగారాన్ని ధరించాలి. ముందే చెప్పుకున్నట్టు బంగారం అందరికీ మంచి చేయదు. కాబట్టి బంగారు ఆభరణాలను సరిగ్గా ధరించాలి.
బరువుతో బాధపడుతున్న వ్యక్తి లేదా పెద్ద కడుపుతో ఉన్న వ్యక్తి బంగారు అలంకరణ ధరించకూడదు. అతి కోపం ఉన్న వ్యక్తులు కూడా బంగారు నుండి దూరం ఉండాలి. బంగారు రంగు పసుపుయై ఉంటుంది. దానికి గురు గ్రహానికి పోలిక లేదు. ఏ వ్యక్తి జాతకంలో గురు గ్రహ దోషం ఉంటుందో ఆ వ్యక్తి బంగారం ధరించకూడదు. వృషభ, మిథున, కన్య, కుంభ రాశివారు కూడా బంగారు ఆభరణాలు ధరించడం మంచిది. తులా, మకర రాశివారు అతి తక్కువ పరిమాణంలో బంగారం ధరించాలి. గర్భిణీలు, వృద్ధ మహిళలు తక్కువ మోతాదులో ధరించాలి. కాలికి కూడా బంగారు అలంకరణ పెట్టకూడదు.
Read Also : Lord Shiva Worship : శివారాధన చేస్తే శనిదోష సమస్యలకు స్వస్తి…
Tufan9 Telugu News And Updates Breaking News All over World