Devotional News : మనం ప్రతి రోజూ మన ఆహార పదార్థాలలో భాగంగా ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తాం. ఉప్పును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు కనుక ఉప్పును ఇతరులకు దానం ఇవ్వకూడదని ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదని, ముఖ్యంగా ఉప్పును తొక్కకూడదని పెద్దలు చెబుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుతో మన ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించవచ్చని చెబుతుంటారు. మరి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఉప్పును ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పును ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఉప్పును పడకగదిలో ఉంచడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. మన ఇంటి చుట్టూ ఉప్పును చల్లడం వల్ల మన ఇంటిపై ఎలాంటి నరదృష్టి, చెడు ప్రభావం ఉండదని పండితులు చెబుతున్నారు.
ఏమైనా ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్తున్నప్పుడు ఉప్పును జేబులో వేసుకుని వెళ్లడం వల్ల పనులు విజయవంతం అవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. అయితే ఉప్పును అతిగా ఉపయోగించరాదు. కొద్దిగానే ఉపయోగించాలి. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World